వైరల్‌ పిక్‌ : నిజంగానే వారి పెళ్లయ్యిందా?

Update: 2019-09-06 10:12 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ మరియు హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ లు ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెల్సిందే. వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు దారి తీసింది. వీరిద్దరి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లి ఉంటుందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ విషయమై రెండు ఫ్యామిలీల నుండి లీక్స్‌ కూడా వచ్చాయి. కాని రణ్‌ బీర్‌ కపూర్‌ తండ్రి రిషీ కపూర్‌ అనారోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. త్వరలో వీరి పెళ్లి ఉంటుందని అంతా అనుకుంటున్న సమయంలో ఒక ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి వీరిద్దరికి పెళ్లి చేసింది.

ఆలియా భట్‌ వరమాల పట్టుకుని ఎదురుగా పెళ్లి కొడుకు కాస్ట్యూమ్స్‌ లో ఉన్న రణ్‌ బీర్‌ కపూర్‌ మెడలో వేసేందుకు సిద్దంగా ఉంది. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీరిద్దరికి రహస్య వివాహం అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్న తర్వాత ఎందుకు వీరు రహస్య వివాహం చేసుకోవాల్సి వచ్చిందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఫొటో నిజం కాదని తేలిపోయింది. ఒక బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం ఆలియా భట్‌ పెళ్లి కూతురుగా ముస్తాభయ్యింది. ఆ ఫొటోను మార్ఫింగ్‌ చేసి రణ్‌ బీర్‌ కపూర్‌ ను ఆమె ముందు పెట్టారు. ఆ ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

కపూర్‌ ఫ్యామిలీకి చెందిన వారు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. రణ్‌ బీర్‌.. ఆలియాల వివాహం వచ్చే ఏడాది జరుగనుందని ప్రకటించారు. నిశ్చితార్థ: మాత్రం ఇదే ఏడాది చివర్లో పెట్టబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆలియా బాలీవుడ్‌ లో పలు చిత్రాల్లో నటించడంతో పాటు తెలుగులో 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' చిత్రంలో చరణ్‌ కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక రణ్‌ బీర్‌ కపూర్‌ కూడా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పెళ్లి తర్వాత కూడా ఆలియా సినిమాల్లో హీరోయిన్‌ గా కంటిన్యూ కాబోతుంది.

Tags:    

Similar News