బాలీవుడ్ హాట్ కం ఫేమస్ కపులు రణబీర్‌కపూర్ - కత్రినాకైఫ్ లు ఇక డేటింగులు, మీటింగులు, చాటింగులకు ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే! ప్రేమించుకున్నది చాలు ఇక పెళ్లి చేసుకోండని ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారో లేక ఆలస్యం అమృతం విషం అని తెలుసుకున్నారో కానీ... వీరిద్దరూ ఇక డేటింగుకు ఫుల్ స్టాప్ పెట్టేసి, పెళ్లిపీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట! ఇప్పటికే తన పెళ్లికి సంబందించిన ఎన్నో హింట్లు ఇచ్చిన రణబీర్ ఇక... కత్రినాతో పెళ్లికి రెడీ అవుతున్నాడు! అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో వీరిద్దరూ అధికారికంగా ఒకటికాబోతున్నారు!
పంజాబీ కుటుంబాల్లో... పెళ్లికి సెట్ అయ్యాక, పెళ్ళికి ముందు ఆ రెండు కుటుంబాలూ కలిసి "రోకా" అనే పంక్షన్ జరుగుపుకుంటారు! ఒక రకంగా దీంతో సగం పెళ్లి అయినట్లే కాకుండా, ఇరు కుటుంబాలకు సమ్మతమే అనే సమాచారం కూడా ఇచ్చినట్లన్నమాట! ఈ కార్యక్రమాన్ని ఇటు కత్రినా, అటు రణబీర్‌కి చెందిన కుటుంబ సభ్యులే కాకుండా... మరి కొంత మంది ఆప్తమిత్రులు, సినీజనాలు కూడా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఈ పెళ్లి తర్వాత ఇక కత్రినా వెండి తెరపై కనిపించే అవకాశాలు లేవనే సంకేతాలు ఇస్తున్నాడు రణబీర్! పెళ్లి అయిన తర్వాత తనకు ముగ్గురు పిల్లలు కావాలని, ముగ్గురు పిల్లలకు తండ్రిని కావాలనిఉందని రణబీర్ మనసులోని మాటను బయటపెట్టేశాడు. దీంతో పెళ్లి తర్వాత కత్రినా వెండితెరకు దాదాపు దూరమైనట్టేనని ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు సినీ జనం! ఎన్నో గాసిప్పులూ, మరెన్నో లుకలుకలు అనంతరం ఇప్పటికైనా వీరిద్ధరూ ఒక్కటి కాబోతున్నారని వీరి కుటుంబ సబ్యులతో పాటు అభిమానులూ ఆనందంగా ఉన్నారట!