యానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్‌: గొడ్డ‌లితో క‌ర్క‌శుడు భ‌య‌పెట్టాడు!

Update: 2023-01-01 05:17 GMT
సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన `యానిమల్` చిత్రం నుండి రణబీర్ కపూర్ ఫ‌స్ట్ లుక్ కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా విడుద‌లైంది. టైటిల్ కి ఏమాత్రం త‌గ్గ‌ని పోస్ట‌ర్ ఇది. నిజానికి చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ ని ఇలాంటి ఒక క‌ర్క‌శుడి పాత్ర‌లో మునుపెన్న‌డూ అభిమానులు చూడ‌లేదు. అత‌డు మునుపెన్న‌డూ చేయని ప్రయత్నం చేశాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే అతడితో ఈ సాహ‌సం చేయిస్తున్న‌ది మ‌న తెలుగోడైన సందీపు. ర‌క్త‌సిక్త‌మైన గొడ్డ‌లిని అలా చంక‌లో పెట్టుకుని ధీమాగా సిగ‌రెట్ వెలిగిస్తూ సైకోలాగా క‌నిపిస్తున్నాడు ర‌ణ‌బీర్.

అయితే అత‌డిలోకి ఈ సైకో ల‌క్ష‌ణాలు ఎందుకు వ‌చ్చాయి?  యానిమ‌ల్ గా ఎందుకు మారాడు?  గొడ్డ‌లి తో క‌ర్క‌శంగా ఏం చేశాడు? అన్న‌ది చూడాలంటే థియేట‌ర్ల‌లోకి సినిమా వ‌చ్చే వ‌రకూ వేచి చూడాల్సిందే. అయితే ఈ పోస్ట‌ర్ చూస్తుంటే క‌చ్ఛితంగా ఇది `ఎ` స‌ర్టిఫికెట్ సినిమా అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ర‌క్త‌సిక్త‌మైన గొడ్డలి ప‌ట్టుకుని రణబీర్ మొదటి పోస్టర్ లో ఘోరంగా కనిపించాడు. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్ లో రణబీర్ కపూర్ ని ప్రెజెంట్ చేస్తామని `యానిమల్` హామీ ఇచ్చింది. మొదటి పోస్టర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. `యానిమల్` క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్కింది. రణబీర్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఆసక్తికరంగా పరిణీతి చోప్రా రణబీర్ తో రొమాన్స్ చేస్తుంద‌ని కూడా వినిపించినా .. సూరజ్ బర్జాత్యా `ఉంచై`లో ఛాన్స్ రావ‌డంతో ఆ సినిమా నుండి నిష్క్రమించింది.

యానిమల్‌ లో అనిల్ కపూర్ -బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోస్టర్ ను ఆవిష్కరిస్తూ `యానిమల్` మేకర్స్ చేసిన ఓ వెరైటీగా ప్ర‌క‌ట‌న ఉత్సుక‌త పెంచింది. రణబీర్ కపూర్ నటించిన ఈ  క్రైమ్ డ్రామా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే క‌థంతా ఉంది. అంచ‌నాలు పెరిగాయి. పోస్టర్ లో రణబీర్ లుక్ సినిమా సారాంశాన్ని చెప్పేసింది. అర్హులైన ప్రేక్ష‌కులే ఈ చిత్రాన్ని చూస్తారు`` అని అన్నారు.

సందీప్ హ్యాట్రిక్ పై క‌న్ను..

తన మొదటి రెండు చిత్రాలైన అర్జున్ రెడ్డి - కబీర్ సింగ్ తో వ‌రుస‌ బ్లాక్ బస్టర్ లను సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమ‌ల్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మూడవ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన రణబీర్ తాపీగా సిగరెట్ తాగుతూ సీరియస్ గా చూస్తున్న తీరును బ‌ట్టి ఇది అర్జున్ రెడ్డిని క‌బీర్ సింగ్ ని మించిన ర‌గ్గ్ డ్ పాత్ర అని అర్థ‌మ‌వుతోంది. అయితే ప్ర‌తి క్రైమ్ వెన‌కా బోలెడ‌న్ని క‌థ‌లు ఉంటాయి. వాటిని సందీప్ ఎలా తెర‌పై చూపిస్తాడో చూడాలి. సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ ను బలమైన పాత్రలో చూపించనున్నారని ఈ లుక్ తో భ‌రోసా వ‌చ్చింది. టి సిరీస్ - భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. `యానిమల్` 11 ఆగస్ట్ 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం హిందీ- తెలుగు- తమిళం- మలయాళం - కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Tags:    

Similar News