సోషల్ మీడియాలో ఉండే సెలబ్రెటీలుచాలా వరకు సినిమాల గురించే మాట్లాడుతుంటారు. సమాజంలోని సమస్యల గురించి స్పందించేవాళ్లు.. వివాదాస్పద అంశాల గురించి తమ అభిప్రాయం చెప్పేవాళ్లు తక్కువ. ఐతే కొందరు మాత్రం తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంటారు. జనాల్లో ఆలోచన రేకెత్తించేలా చక్కగా తమ అభిప్రాయాలు చెబుతుంటారు. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా తాజాగా పెట్టిన ఫేస్ బుక్ పోస్టు అలాంటిది. అతను కుల వివక్ష.. మత మౌఢ్యం మీద ప్రస్తుతం అనేక వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఒక పవర్ ఫుల్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో రణదీప్ ఏమన్నాడంటే..
‘‘ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లిం అయితే వేల ఏళ్ల నుంచి ప్రశాంతంగా బతికి ఈ దేశంలో ఉన్నట్లుండి రక్షణ కరవైపోయిందని భయపడాలి.. దళితులైతే ఉన్నట్లుండి తమకు ఘోర అవమానం జరిగిపోతున్నట్లు భావించాలి.. హిందువులైతే ఉన్నట్లుండి తమ గోవుల్ని అకారణంగా చంపేస్తున్నట్లు ఆందోళన చెందాలి.. జైనులైతే ఉన్నట్లుండి తమ మతానికి అపరాధం జరిగిపోతున్నట్లు భయపడాలి.. పంజాబీలైతే ఉన్నట్లుండి తమ యువత మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారని కంగారు పడాలి..
ఐతే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. న్యూస్ చూడటం మానేస్తూ.. మతం మీద చర్చలు పెట్టడం మానేసి చూస్తే.. వివిధ మతాలకు.. కులాలకు.. వర్గాలకు చెందిన స్నేహితులు కనిపిస్తారు.. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాల్లో ఒకదాంట్లో మనం జీవిస్తున్న సంగతి బోధపడుతుంది’’ అంటూ జనాల్లో ఆలోచన రేకెత్తించే.. చైతన్యం పెంచే మాటలు చెప్పాడు రణదీప్. అతడి పోస్టు అక్షర సత్యమంటూ అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/