బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యూత్ స్టార్ నితిన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. 2020 సంక్రాంతి అనంతరం రిలీజైన భీష్మ అతడి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రీకరణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రంగ్ దే నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.
నిజానికి రంగ్ దే బిజినెస్ చాలా ముందస్తుగానే క్లోజ్ అయిపోవడం తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. భీష్మ టైమ్ లోనే ఎంతో తెలివిగా రంగ్ దే బిజినెస్ డీల్ ని నితిన్ క్లోజ్ చేసేశారు. గతేడాదే బిజినెస్ క్లోజ్ అవ్వడం.. అప్పట్లోనే ఎక్కువ రేట్లుకి అమ్మేయడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఫిబ్రవరి చివరి వారంలో విడుదలైన `చెక్` ఆశించిన విజయం దక్కించుకోకపోవడంతో దాని ప్రభావం రంగ్ దే వసూళ్లపై పడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా తొనొకటి తలిస్తే అన్న చందంగా అవ్వడం నిరాశపరిచింది. ఇక నితిన్ కి ఓపెనింగ్స్ విషయంలో ఎక్కడా డోఖా లేదు. కానీ తొలి వీకెండ్ తరువాత కంటెంట్ ని బట్టే వసూళ్లు ఉంటాయి. నితిన్ మాత్రం రంగ్ దే సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. రంగ్ దేలో నితిన్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించారు.