మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా కు విడుదల ముందు వరకు ఉన్న బజ్ విడుదల తర్వాత కనిపించడం లేదు. సినిమా మూస కథ మరియు కథనాలతో రూపొందింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వైష్ణవ్ ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకోవాల్సింది కాదంటూ రివ్యూలు వస్తున్నాయి.
ఇదే సమయంలో సినిమాలో మెగా హీరోలు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ల యొక్క ఇన్ పుట్స్ కాస్త చిరాకుగా ఉన్నాయి. మామయ్య ల సినిమాల తాలూకు పోస్టర్ లను మరియు పాటలను సినిమాలో పెట్టడం ద్వారా వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాలి అనుకున్నాడేమో. కానీ అదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు అసంతృప్తి కలిగేలా చేస్తున్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఉప్పెన సినిమాలో కూడా అక్కడక్కడ మెగా ఇన్ పుట్స్ కనిపిస్తాయి. కానీ అవేవి కథ మరియు స్క్రీన్ ప్లే పై ప్రభావం చూపించవు. కానీ మామయ్యలను చూపించాలనే ఉద్దేశ్యంతో స్క్రీన్ ప్లే ను మార్చడం చర్చనీయాంశంగా మారింది. హీరో మరియు హీరోయిన్ బస్సులో వెళ్లే సమయంలో అత్తారింటికి దారేది ని చూపిస్తారు.. చిరంజీవి పాట కూడా ఉంటుంది.
పలు సన్నివేశాల్లో సందర్భానుసారంగా కాకుండా అతికించినట్లుగా మెగా ఇన్ పుట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో తమ కుటుంబంకు చెందిన పెద్దల యొక్క ఇన్ పుట్స్ ను వాడటం అనేది అందరు చేసేదే.. కానీ ఒక హద్దు మరియు ఒక పరిధి అనేది ఉండాల్సిన అవసరం ఉంది.
రంగ రంగ వైభవంగా సినిమా లో అనవసరంగా వాటిని పెట్టడం ద్వారా ఆ సమయంలో మెగా ఫ్యాన్స్ కేకలు వేయడం తప్ప మరేం లేదు. ప్రేక్షకులకు స్క్రీన్ ప్లే లో జర్క్ రావడంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంతగా మెగా ఇన్ పుట్స్ ఉండటంకు కారణం హీరో వైష్ణవ్ తేజ్ సలహా అయ్యి ఉంటుందా లేదంటే దర్శకుడు గిరిశాయ సొంత తెలివి అయ్యి ఉంటుందా అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.