సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కు మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిందనే చెప్పాలి. సాధారణంగా సినిమా విడుదలై నెల రోజులు దాటితే కలెక్షన్స్ లో తేడా వచ్చేస్తాయి. ఇక వెబ్ మీడియాలు రిలీజ్ చేస్తే కలెక్షన్స్ క్లోజ్ అవ్వాల్సిందే. కానీ రంగస్థలం సినిమా ఆఫ్ సెంచరీ తరువాత కూడా మంచి షేర్స్ అందుకుంది. బయ్యర్లకు ఊహించని లాభాలను అందించిందని ఒప్పుకోవాల్సిందే.
గతంలో ఎప్పుడు లేని విధంగా అమెజాన్ ప్రైమ్ లో రంగస్థలం సినిమా విడుదలైనప్పటికి కూడా మంచి షేర్స్ అందుకుంది. ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అందుకోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి సినిమా తరువాత అత్యంత ఎక్కువ కలెక్షన్స్ షేర్స్ అందుకున్న సినిమాగా రంగస్థలం నిలిచింది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఏరియాల వారీగా కొన్నిటిలో బాహుబలి 2 తరువాత రంగస్థలం నిలిచింది. కొన్ని స్థానాల్లో బాహుబలి 1 అండ్ 2 తరువాత టాప్ 3 లో నిలిచింది.
నైజం: టాప్ 3 ( బాహుబలి 2 - బాహుబలి 1 - రంగస్థలం)
సీడెడ్: టాప్ 3
ఉత్తరాంధ్ర: టాప్ 2( బాహుబలి 2 - రంగస్థలం)
గుంటూరు: టాప్ 3
ఈస్ట్: టాప్ 3
కృష్ణ: టాప్ 2
వెస్ట్: టాప్ 3
నెల్లూరు: టాప్ 3