రామ్ చరణ్ తేజ్ రంగస్థలం నాటకం ఊహించిన దాని కన్నా మిన్నగా రక్తి కడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సునామి రేపుతోంది. అదనపు షోలు వేసుకునే సౌలభ్యాన్ని పూర్తిగా వాడుకుని లాభపడిన సినిమాగా కూడా రంగస్థలం కొత్త రికార్డు సెట్ చేసింది. ఏప్రిల్ 5 దాకా ఉదయం పూట ఒక షో వేసుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడం ఎగ్జిబిటర్లకు వరంగా మారింది. ప్లస్ కలెక్షన్ కు సైతం ఊతంగా నిలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో తొలిసారి తమ మెగా పవర్ చూపిస్తున్నాడు రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో సెట్ చేసిన రికార్డుని రంగస్థలం కేవలం 2 రోజుల్లో అధిగమించడం చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సైతం నోరెళ్ళబెడుతున్నారు. హిట్ గెస్ చేసాం కాని మరీ ఈ రేంజ్ కాదని వాళ్ళ మాట. రామ్ చరణ్ సినిమాలు మాస్ ముద్రతో అమెరికాలో బాగా పెర్ఫార్మ్ చేసిన సందర్భాలు తక్కువ. కాని రంగస్థలం కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది.
జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో 1.8 మిలియన్ డాలర్లు రాబడితే ప్రీమియర్లతో కలిపి రంగస్థలం చిట్టిబాబు రెండు రోజుల్లో 1.9 మిలియన్ డాలర్లు రాబట్టి సాలిడ్ స్ట్రాంగ్ గా దూసుకుపోతున్నాడు. ఇప్పటి దాకా రామ్ చరణ్ కెరీర్ లో ధృవ మాత్రమే ఫుల్ రన్ లో 1.47 మిలయన్ డాలర్ మూవీగా ఉంది. అది కూడా టీం మొత్తం అక్కడికి వెళ్లి ప్రమోట్ చేస్తే అంత మాత్రమైనా వచ్చింది. కాని రంగస్థలం విషయంలో కనీసం అక్కడ కాలు కూడా పెట్టలేదు. ఇప్పుడు రంగస్థలం నెక్స్ట్ టార్గెట్ నాన్నకు ప్రేమతో(2.02 మిలియన్ డాలర్లు)-అజ్ఞాతవాసి(2.07 మిలియన్ డాలర్లు). ఇది మహా అంటే రేపు ఈ టైంకి లాంచనం పూర్తవుతుంది.
ఇప్పుడు రంగస్థలం ఓవర్సీస్ లో ఎక్కడ నిలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఖైది నెంబర్ 150ని టార్గెట్ పెట్టుకున్న రంగస్థలం చాలా చోట్ల అది సాధించే దిశగా వెళ్తోంది. మండిపోయే ఎండల్లో సైతం రంగస్థలం తెస్తున్న వసూళ్లు చూసి హమ్మయ్య అంటూ బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకుంది అని వినిపిస్తున్న కామెంట్ నిజమే అనిపిస్తుంది. కాదనే సాక్ష్యాలు ఎవరి దగ్గరా లేవు మరి.