రామ్ చరణ్ మూవీ రంగస్థలం హంగామా ఊరూరా కనిపిస్తోంది. యూఎస్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి యాంటి ఫ్యాన్స్ వరకూ అందరూ రంగస్థలం గురించి తెగ డిస్కషన్స్ జరిగిపోతున్నాయి.
1980ల కాలం నాటికి తీసుకువెళ్లి.. ఆ కాలం నాటి గ్రామీణ నేపథ్యాన్ని.. పల్లెటూరి రాజకీయాలను.. ప్రేమలను పంచడంలో -సుకుమార్ అండ్ టీం బాగా సక్సెస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడిన అన్ని ఏరియాల నుంచి రంగస్థలంకు.. టాక్ సూపర్బ్ గా వినిపిస్తోంది. ప్రీమియర్లకు ప్రీ బుకింగ్స్ తోనే చెర్రీ కొత్త రికార్డు కొట్టేశాడు. ఫస్ట్ ప్రీమియర్ పడకముందే 4లక్షల డాలర్లు కలెక్ట్ చేయగా.. ఇంకా ఫైనల్ లెక్క రావాల్సి ఉంది. టాలీవుడ్ టాప్-5 ప్రీమియర్ కలెక్షన్స్ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే.. రంగస్థలం టాక్ అద్భుతంగా రావడంతో.. ఇదే జోరు కొనసాగుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ప్రీమియర్స్ తో భారీగా వసూలు చేసినా.. ఆ తర్వాత డల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి. కానీ రంగస్థలం ఊరికి తీసుకెళ్లిన చిట్టిబాబు మాత్రం. అజ్ఞాతవాసి చేసిన గాయానికి మందు వేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో పాటు.. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండడం.. ఆడియోలో ఐదే వినిపించినా.. సినిమాలో ఆరు పాటలు ఉండడం.. క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ పండించేయడం.. రంగస్థలంకు అడ్వాంటేజెస్ గా చెబుతున్నారు ఆడియన్స్.