బాలీవుడ్ హాట్ పెయిర్ రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణేల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరంలేదు. ‘రామ్ లీలా’, ‘బాజీ రావ్ మస్తానీ’ వంటి సినిమాలతో వెండితెరపై తమ అద్భుతమైన నటనతో కెమిస్ట్రీ పండించారు. ‘పద్మావత్’ సినిమాలో వీళ్లిద్దరు జంటగా నటించినా ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఎక్కువ సన్నివేశాలు కూడా లేవు. ఆ తర్వాత వీళ్లిద్దరు నిజ జీవితంలో పెళ్లితో ఒకింటి వాళ్లైయ్యారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడికి కలవరపడిన ప్రజానీకం ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెలెబ్రెటీలు మొదలుకొని సాధారణ ప్రజానీకం దాకా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. తాజాగా దీపికా రణవీర్ జోడీ కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయింది. స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ జంట కాలక్షేపం కోసం తమ ఇంట్లో జిమ్మింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది. ఈ ఫొటోలో భార్యాభర్తలిద్దరూ భిన్నమైన ఎక్స్ ప్రెషన్ తో ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెళ్లి తర్వాత ఎవరికి వాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న వీళ్లిద్దరు ఇపుడు 1983 భారత్ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘83’ బయోపిక్ లో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య రోమి దేవ్ పాత్రలో దీపికా పదుకొణే యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలిసారిగా రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణే ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి నటించిన ప్రతి సినిమాలో వీళ్లద్దరు చనిపోయే పాత్రల్లోనే నటించారు. కానీ ఫస్ట్ టైమ్ పెళ్లి తర్వాత సుఖాంతం అయ్యే కథలో నటించడం విశేషం.