నాని హీరోగా వచ్చిన ఆహా కళ్యాణం అనే మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది బాలీవుడ్ భామ వాణి కపూర్. అంతకు ముందు ఆమె నటించినది ఒకే ఒక్క బాలీవుడ్ మూవీ. రెండో సినిమాగా నానితో కలిసి నటించి.. మన నేచురల్ స్టార్ కి ఓ స్ట్రాంగ్ కిస్ ఇస్తుంది. ఈ సీన్ చేయడానికి నాని చాలానే ఇబ్బంది పడ్డాడు కానీ.. వాణి మాత్రం ఈ సీన్ కి బోలెడంత న్యాయం చేసింది. ఇప్పుడీ భామ బేఫికర్ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.
ఇందులో హీరో రణవీర్ సింగ్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. ఎందుకంటే.. స్టోరీ ప్రకారమే బేఫికర్ లో 23 మూతి ముద్దుల సీన్స్ ఉంటాయట. దానికి సై అనడంతోనే వాణి కపూర్ కి ఛాన్స్ ఇచ్చారని చెప్పుకున్నారు. ఇలా ఒక సినిమాలో 23 లిప్ కిస్సులంటే.. ఇండియన్ ఫిలింస్ లో ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ చెరిగిపోతాయన్న మాట. ఇక రణవీర్ కి ముద్దులిచ్చేందుకు వాణి కపూర్ ఏ మాత్రం మొహమాటపడ్డంలేదని యూనిట్ వర్గాలంటున్నాయి.
సీన్ పర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లు అయినా పెదాలను అప్పగించేస్తోందట కూడా. అసలీ బేఫికర్ మూవీకి ఇచ్చిన ఫస్ట్ లుక్ కూడా వాణీ కపూర్-రణవీర్ సింగ్ ల లిప్ లాకే. మొత్తానికి ముద్దులతో కొత్త రికార్డ్ సృష్టించేందుకు వాణి కపూర్ బాగానే ట్రై చేస్తోంది. ఈమెకు ఆఫర్స్ రావడంలో ఈ లిప్ కిస్సులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నది బాలీవుడ్ టాక్.