బాలీవుడ్లో సెలబ్రిటీలను ఎప్పుడూ మీడియా క్లోజ్ గా ఫాలో అవుతూ ఉంటుంది. ఇక కపుల్స్ అనుకోండి.. ఇంకాస్త ఎక్కువగా వారిని ఫాలో అవుతుంటారు. ఈమధ్య బాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. భార్యలపై భర్తలు అతిప్రేమను కురిపించడం. మొన్నటికి మొన్న సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజాలో ఒక షో రూమ్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. అక్కడ సతీమణిగారి షూ లేస్ ఊడిపోయింది. అంతే.. ఒక్క క్షణంలో భర్తగారు సోనమ్ షూ లేసును కట్టారు. కాస్త వింత సంఘటన అయినా జనాలు దీనిపై కొత్త గాసిప్పులు అల్లారు. సోనమ్ నీళ్ళోసుకుందని అందుకే భర్త గారు యమా జాగ్రత్తగా ఉన్నారు అని అన్నారు. ఇంకా ఆ ప్రెగ్నెన్సీ సంగతి తేలలేదు.
ఇక ఈ ఎపిసోడ్ ముగిసిందని అనుకుంటే కొత్తగా రణవీర్ సింగ్ నేనున్నాను అంటూ లైన్లోకి వచ్చాడు. ఆనంద్ అహూజా గారు జస్ట్ షూ లేస్ ముడి వేస్తే ఈ సింగుగారు ఏకంగా ప్రియమైన సతీమణి చెప్పులు మోసి తరించారు. డీటెయిల్స్ లోకి వెళ్తే రీసెంట్ గా దీపిక పదుకొనే-రణవీర్ సింగ్ జంట ఒక శుభకార్యానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భార్యామణి ఎవరినో పలకరిస్తూ.. శుభాకాంక్షలు చెబుతూ బిజీగా ఉంటే వెనకాల రణవీర్ సింగ్ ఆవిడ చెప్పులను దైవ ప్రసాదంలాగా జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఈ వీడియో.. చెప్పులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చర్చలకు దారితీసింది.
ఈమధ్య ఇంగ్లీష్ లో కొన్ని పదాలు ప్రతిదానికి వాడుతున్నారు లెండి. కపుల్ గోల్స్ అని.. మేజర్ కపుల్ గోల్స్ అని. అంటే దీనర్థం పబ్లిక్ లో కెమెరాల ముందు భార్యాభర్తలు ఎలా ఉన్నారనేది చూసి హాఫ్ నాలెడ్జ్ ఉండే మేథావులు చూసి అది అన్యోన్య దాంపత్యం అని డిసైడ్ చేస్తున్నారు. కానీ అన్యోన్య దాంపత్యానికి ఒకరి చెప్పులు ఒకరు మోయలసిన పని లేదు. పబ్లిక్ లో లిప్పులు లాక్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. గుర్తుంచుకోవాల్సిన మరో హార్డ్ రియాలిటీ ఏంటంటే.. ఈ జంటల పెళ్ళై జస్ట్ వన్ ఇయర్ కూడా కాలేదు.. వివాహ బంధం లో ఈ దశను 'హనీమూన్ పీరియడ్' అంటారు. చాలా కార్పోరేట్ ఆఫీసుల్లో ఈ పదాన్ని వాడుతుంటారు. అంటే మైకంలో.. మ్యాజికల్ గా ఉండే దశ. ఆ తర్వాత ప్రేమ మైకం దిగిన తర్వాత రియాలిటీ లోకి వస్తారు. ఇక టాపిక్ సీరియస్ అవుతోంది.. దానికి తోడు ఇదో పెద్ద డిబేట్ కాబట్టి పక్కన పెట్టేసి ఈ చెప్పులు మోసిన ఎపిసోడ్ కు నెటిజనుల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
* ఇది టూమచ్
* హస్బెండ్ ఆఫ్ ది మిలేనియం
* ఈ ప్రపంచంలోనే క్యూటెస్ట్.. స్వీటెస్ట్ కపుల్.
* జోరు కా గులాం(భార్య దాసుడు)
* ఇదేరకంగా దీపిక కనుక రణవీర్ చెప్పులు పట్టుకుంటే కూడా స్వీట్ లవ్వు.. ముచ్చటైన జంట అనండి!
* యువరాజు.. సిండ్రెల్లా.. షూ కథను గుర్తు చేశారు(దయచేసి అదేంటని అడక్కండి మహాప్రభో.. అదో క్యూట్ కథ)
* అహూజా లేసులు కడితే.. సింగు చెప్పులు మోస్తాడు.
* ది బెస్ట్ హస్బెండ్