పెళ్లాం చీర‌లు కుట్టించుకున్న హీరో

Update: 2020-01-25 06:37 GMT
`పెళ్లాం చెబితే వినాలి` టైపులో ఉందీ హీరో గారి వేషం. అంత‌గా ఆలికి లొంగ‌నివాడైతే ఏమిటీ వేషం?.. మ‌రీ సిగ్గు లేకుండా ఇలా చేశాడేం? ఎంత‌గా ఫ్యాష‌న్ ప్రియుడు అయితే మాత్రం మ‌రీ ఇలా పెళ్లాం వాడి పారేసిన చీర‌ల్ని చొక్కాలు ఫ్యాంట్లు కుట్టించుకుంటాడా హ‌వ్వ‌!? అంటూ చెల‌రేగిపోతున్నారు ఫ్యాన్స్.

ఎన‌ర్జిటిక్ హీరో అని పొగిడేస్తుంటే ఏమిటిలా చేస్తున్నాడు? అత‌డిలో ఉన్న‌ట్టుండి ఏమిటీ పెనుపోక‌డ‌? ఇన్నాళ్లు ఏదో స‌రికొత్త‌ ఫ్యాష‌న్స్ ని.. నెవ్వ‌ర్ ఎవ్వ‌ర్ లేటెస్ట్ స్టైలింగ్ ని అనుస‌రిస్తున్నాడ‌ని అనుకుంటే ఇప్పుడిలా ఏకంగా హిజ్రా స్టైల్ తో షాకిచ్చాడు? నీ ఛ‌మ‌త్కారం చాకిరేవుకెళ్లా.. అంటూ ఫ్యాన్స్ మూతి పై వేలేసుకుంటున్నారు.

ఇదేమి పూల చొక్కాయ్.. అస‌లు ఈ గాగ్రా ఫ్యాంటు వేషం ఏమిటి? అంటూ ఒక‌టే ఛీత్క‌రించుకుంటున్నారు. పైగా పోనీ టెయిల్ లాగా ఆ మెడ‌లో వేలాడ‌దీసిన దేమిటి? కాఫీ క‌ల‌ర్ డైమండ్ షేప్ క‌ళ్ల‌ద్దం పెట్టాడేమిటి? అస‌లు ఆ త‌ల‌క‌ట్టుపై పాత సినిమాలో సుహాసినిలా హెడ్ స్క్రాఫ్ ని త‌ల‌పించే క్యాప్ పెట్టుకున్నాడేమిటి? అస‌లు ఇవి మ‌గాళ్లు ధ‌రించేవేనా? 300 సినిమాలో జ‌క్సిస్ మ‌హారాజు ఏమైనా పూనాడా? ఏమిటిది ర‌ణ‌వీర్? అంటూ ఒక‌టే ఇదైపోతున్నారు ఫ్యాన్స్. ఇంత‌కీ ర‌ణ‌వీర్ నుంచి ఏదైనా స‌మాధానం వ‌స్తుందా? .. ఇంత‌కీ బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ ఏం చేసినా దానిని ఫాలో అయ్యే మ‌న రౌడీ దేవ‌ర‌కొండ ఈ లుక్ చూడ‌లేదు క‌దా!.. చూస్తే కొంప‌దీసి ఫాలో అయిపోయినా అయిపోతాడేమో!!

అస‌లింత‌కీ ర‌ణ‌వీర్ ఎందుకిలా చేస్తున్నాడు? అన్న‌ది లోతుగా ఆరా తీస్తే... ప్రస్తుతం `83` ప్ర‌మోష‌న్స్ లో ఉన్న అత‌డు ఆ సినిమాకి క్రేజు తెచ్చేందుకే ఇలా ఇన్నోవేటివ్ గా కొత్త వేషం వేసాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 83 పోస్ట‌ర్లు విడుద‌ల చేసే కార్య‌క్ర‌మంలో రణ్‌వీర్ సింగ్ ఇలా ప్ర‌త్య‌క్ష‌మై షాకిచ్చాడు. రణ్‌వీర్ ను చూడ‌గానే నెటిజ‌నులు చెల‌రేగుతూ.. `దీపికా కే కప్డే పెహన్ లియే క్యా? అంటూ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. ర‌ణ‌వీర్ కొత్త రూపాన్ని కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇంకొందరు భార్య దీపికా పదుకొనే నుండి బట్టలు అరువు తెచ్చుకున్నాడేమో! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News