కొంటెతనం.. ఎనర్జీ కలబోస్తే ఆ రెండిటి రూపం రణవీర్ సింగ్. అతడిని బ్రహ్మ ఏం పెట్టి చేశాడో కానీ, ఆ జోష్ వేరొక హీరోలో కానీ, వేరొక చోట కానీ ఎక్కడా చూడలేం. రణవీర్ లోని ఎనర్జీ అతడి సినిమాలకు విపరీతమైన ప్రచారం తెచ్చి పెడుతోంది. అతడి ప్రతి యాక్టివిటీ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిపోతోంది. అయితే ఒక్కోసారి అతడి పిచ్చి ప్రకోపించడంపై ఫ్యాన్స్ తీవ్రంగానే విమర్శిస్తున్నారు.
ఒక్కోసారి అతడి ఫ్యాషన్ శ్రుతి మించుతోంది. పూల చొక్కాయ్ లు... హాఫ్ నిక్కర్లతో వీధుల్లో తిరిగేస్తూ కుర్ర వేషాలతో జుగుప్స పుట్టిస్తున్నాడన్న విమర్శ ఉంది. ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే తాజాగా మరో కొత్త వివాదం రణవీర్ ని నలుగురిలో పలుచన చేసింది. మొన్నటికి మొన్న రణవీర్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొని అక్కడ బోలెడన్ని కొంటె వేషాలు వేశాడు. కాలేజ్ బోయ్ లా చిలిపి వేషాలు వేస్తూ చీర్ లీడర్ ని నేను అంటూ అభిమానులకు ట్రీటిచ్చాడు. ఈవెంట్ లో వచ్చిన ముద్దుగుమ్మలందరినీ హగ్ చేసుకుంటూ అతడు చూపించిన ఉత్సాహం జనాలకు సందేహం కలిగించింది.
అంతేకాదు.. ఆ ఈవెంట్ లో వేదికపై తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇస్తూనే ఉన్నట్టుండి అక్కడి నుంచి జనంలోకి దూకేశాడు. ఆ సన్నివేశాన్ని అస్సలు ఎవరూ ఊహించనేలేదు. దీంతో అక్కడ ఉన్న అభిమానులకు మూతి వాచింది. కొందరికి గాయాలు కూడా అయ్యాయట. అసలే 90 కేజీల భీకరమైన రాయి లాంటి విగ్రహం మీద పడేసరికి అభిమానులంతా కంగారు పడిపోయారట. ఆ సన్నివేశంలో ఏమని అనాలో కూడా తెలియక మొహమాట పడి కొందరు అలానే బేలగా కూచుండిపోయారట. అందులో ఒక అమ్మాయికి గాయాలై నేలపై కూచుని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిపోతోంది.
రణవీర్ ఇలాంటి వేషాలు వేయకుండా పరిణతితో వ్యవహరించాలని కొందరు నెటిజనులు సూచిస్తున్నారు. అసలే సింబా సక్సెస్ తో జోష్ మీద ఉన్నాడు. పైగా టాప్ బ్యూటీ దీపిక పదుకొనేని పెళ్లాడాక ఆ ఉత్సాహం మరింతగా రెట్టించింది. ఇండస్ట్రీలో ఎదురే లేని స్టార్ గా ఎదిగేస్తున్న ఉత్సాహం అతడి బాడీలో స్వింగు పెంచేస్తోంది. అందుకే అతడు వేదికలెక్కి జంప్ లు చేస్తున్నాడని ఫ్యాన్స్ కాస్తంత ఘాటుగానే స్పందిస్తున్నారు. రణవీర్ - ఆలియా జంటగా నటించిన గల్లీబోయ్ ఈనెల 14న రిలీజవుతోంది. ఆ సినిమా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాడు రణవీర్. ఏదో ఒకటి చెయ్యకపోతే తన గురించి ఎవరు చెప్పుకుంటారు? అందుకే రణవీర్ ఇలా ఉత్సాహంగా వేదికపై నుంచి గెంతేశాడంతే అనుకోవాలి.