2019-20 లో ప్రదర్శితమై క్రిటిక్స్ ప్రశంసలు పొందిన దేశీయ కమర్షియల్ హిట్ చిత్రాలకు ఆస్ట్రేలియా టొరొంటో అంతర్జాతీయ ఉత్సవాల్లో అరుదైన గౌరవం దక్కనుంది. ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ 8వ ఎడిషన్ ఆగస్టు 9 నుండి 15 వరకు జరగనుంది. ఈ సంవత్సరం పండుగలో భాగంగా తెలుగు- తమిళం- మలయాళం- హిందీ నుండి విమర్శకుల ప్రశంసలు పొందిన .. వాణిజ్యపరంగా విజయవంతమైన నాలుగు సినిమాలు ప్రదర్శించనున్నారు.
నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` సహా సౌత్ నుంచి పలు చిత్రాలు ఇక్కడ ప్రదర్శనకు అర్హత సాధించాయి. కార్తీ- ఖైదీ (కైతి).. ఫహద్ ఫాజిల్ `ట్రాన్స్` .. హృతిక్ రోషన్ `సూపర్ 30` ఈ ఉత్సవంలో స్క్రీనింగ్ కోసం ఎంపికయ్యాయి. ఇవన్నీ ఏడాదిలోపు విడుదలైనవి. ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసే అద్భుత కథాంశాలతో స్టార్ల అద్భుత నటప్రదర్శనతో మెప్పించిన చిత్రాలుగా టాక్ తెచ్చుకున్నవే ఇవన్నీ. అందుకే ఈ అంతర్జాతీయ సినిమా పండగలో అరుదైన గౌరవం అందుకుంటున్నాయి.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన `జెర్సీ` క్రిటిక్స్ మనసు దోచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గానూ లాంగ్ రన్ లో చక్కని వసూళ్లు సాధించిందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. నేచురల్ స్టార్ నటనకు పేరొచ్చింది. నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కి గొప్ప గుర్తింపు దక్కింది. జెర్సీ ప్రస్తుతం హిందీ.. తమిళంలో రీమేకవుతున్న సంగతి తెలిసిందే.