నానికి సుంద‌రం రూపంలో అరుదైన అవ‌కాశం!

Update: 2022-04-21 11:31 GMT
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా  వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో 'అంటే సుంద‌రానికి' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ తో సినిమా థీమ్ ఏంటి? అన్న‌ది అర్ధ‌మైంది. టీజ‌ర్ ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రంలా అనిపిస్తుంది. ఇక టీజ‌ర్ కి వ‌చ్చిన రెస్పాన్స్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో  ట్రెండింగ్ లో నిలిచింది. బ్ర‌హ్మాణుడి పాత్ర‌లో నాని గెట‌ప్..క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌జ్రియా పాత్ర‌లు ఆద్యంతం వినోదాత్మ‌కంగా హైలైట్ అవుతున్నాయి.

న‌జ్రియా చ‌మ‌త్కార‌మైన కామెడీ..ఆత్రేయ డైలాగులు.. ఫ‌న్నీ సెట‌ప్ వినోద ప్రియుల్ని ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ విడుద‌లైన 24గంట‌ల్లోనే యూ ట్యూబ్ లో 11 మిల‌య‌న్ల వ్యూస్ ని సాధించి రికార్డు సృష్టించింది. యూ ట్యూబ్ చార్ట‌ర్లో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన నాని సినిమాల టీజ‌ర్ల‌న్నింటిలోనే ఇదే రికార్డు వ్యూస్ ని సాధించింది. అత్య‌ధికంగా వీక్షించ‌బ‌డిన టీజ‌ర్ల‌లో ఎనిమిద‌వ స్థానంలో ఉంది.

దీంతో నాని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..ఐకాన్ స్టార్  అల్లు అర్జున్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కూ నానికి ఇలాంటి అవ‌కాశం ఏ సినిమా రూపంలో రాలేదు. తొలిసారి సుంద‌రం  ద్వారా బిగ్ స్టార్స్ స‌ర‌స‌న స్థానం సంపాదించాడు. ఇక నాని రెట్టించిన ఉత్సాహంలో చేసిన వ్యాఖ్య‌లు మీడియాలో అంతే హైలైట్ అవుతున్నాయి.

'టీజర్ అద్భుతంగా ఉంది. ట్రైల‌ర్ దానికి రెట్టింపు ఉంటుంది. ట్రైల‌ర్ కంటే సినిమా ప‌ది రెట్లు ఉంటుంది. ఇది నా వాగ్ధానం అని లాంచ్ ఈవెంట్ లో నాని అన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇచ్చిన మాట‌ని ఎంత మేర నిల‌బెడ‌తాడు అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలుతుంది.  

న‌టుడిగా నాని ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నేచుర‌ల్  స్టార్ గా తెలుగు ప్రేక్ష‌కుల్లో ముద్ర వేసాడు. త‌న‌దైన మార్క్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాడు. నాని గ‌త సినిమా 'ట‌క్ జ‌గ‌దీష్' మాత్రం అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయింది. శివ స‌క్సెస్ ఫుల్ మార్క్..నాని ఇమేజ్ తో జ‌గ‌దీష్ గ‌ట్టిగానే కొడ‌తాడ‌ని భావించారు. కానీ అంచ‌నాల‌న్ని తారుమ‌ర‌య్యాయి. ఇప్పుడా ఆ లెక్క‌ల‌న్నింటిని సుంద‌రం సెట్ చేయాల్సి ఉంది. ఇంకా నాని చేతిలో ప‌లు ప్రాజెక్ట్ లు ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడితో 'ద‌స‌రా' అనే సినిమా చేస్తున్నాడు.
Tags:    

Similar News