అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా.. అన్నీ సినిమాలు హిట్లవుతాయా? ఒక్కోసారి రివర్స్ లో జరుగుతుంది.. అప్సెట్ అవ్వాల్సి వస్తుంది. అలానే ఈమధ్య రాశి ఖన్నా తన లాస్ట్ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో అప్సెట్ అయిందని వార్తలు వచ్చాయి. సినిమాపై ఎంతో నమ్మకంతో బోల్డ్ గా నటించినప్పటికీ ప్రయోజనం దక్కలేదని.. కమర్షియల్ సక్సెస్ సంగతి దేవుడెరుగు కనీసం విమర్శకుల ప్రశంసలు కూడా దక్కకపోవడంతో ఇకపై బోల్డ్ సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయిందని అన్నారు.
సినిమా డిజాస్టర్లుగా నిలిచిన సమయంలో కొందరు హీరోలు.. హీరోయిన్లు ఫీల్ కావడం..ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమే కదా.. అందుకే చాలామంది ఈ వెర్షన్ నిజమేమో అని నమ్మారు. కానీ తానేమీ ఫీల్ కాలేదని రాశి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. తను అప్సెట్ అయిందన్న కథనాలపై స్పందిస్తూ "నేను నటించిన సినిమాల పట్ల నేనెప్పుడూ బాధపడను. నాకెలాంటి విచారం లేదు. ఒక సినిమా విజయం సాధించొచ్చు లేక సాధించకపోవచ్చు. కానీ ప్రతి సినిమా నాకు ఒక అందమైన ప్రయాణం లాంటింది. నటిగా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం దక్కుతుంది. అందుకే నేను నటించిన సినిమాలకు నేను సపోర్ట్ గానే ఉంటాను" అని తేల్చేసింది.
తను నటించిన సినిమాలు హిట్..ఫ్లాపుల తో సంబంధం లేకుండా గౌరవిస్తానని ఎంతో పరిణతితో రాశి చెప్పడం చాలామంది నెటిజన్లను మెప్పించింది. సినిమా ఒప్పుకునే సమయంలో ఎవరైనా హిట్ అవుతుందనే అనుకుంటారు. ఇది పక్కా ఫ్లాప్ అని తెలిస్తే దానికి ఎలాంటి హీరో అయినా.. హీరోయిన్ అయినా కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటారు కదా?