అందం రాశిగా పోస్తే ఇలా అయ్యింది!

Update: 2021-10-13 02:30 GMT
ఢిల్లీ బ్యూటీ రాశిఖ‌న్నా కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోంది. వ‌రుస‌గా తెలుగు.. త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తూ ఎన్న‌డూ లేనంత బిజీగా ఉంది. రెండేళ్ల  డైరీ ఫుల్ అయింది. ఆన్ సెట్స్ లో కొన్ని సినిమాలుంటే .షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న‌వి మ‌రికొన్ని. వీటిలో ఎక్కువ‌గా  కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఇక రాశిఖ‌న్నా ఫోటో సెష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎప్పటిక‌ప్పుడు కొత్త  కొత్త ఫోటో షూట్ల‌తో దిల్లీ బ్యూటీ కాక‌లు రేపుతోంది. విదేశీ ట్రిప్ కి సంబంధించిన‌వైనా..టెంప్టింగ్  ఫోటోలైనా సరే ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాల్సిందే. వాటిపై  కామెంట్ల‌తో హీటెక్కాల్సిందే.

తాజాగా రాశీఖన్నా కొత్త  ఫోటోషూట్ ఒక‌టి ఇన్ స్టాలో  వైర‌ల్ గా మారింది. ఈ ఫోటో సెష‌న్ లో రాశి గ్లామ‌ర్ ఎలివేష‌న్ పై దృష్టి పెట్ట‌లేదు. మ‌త్తెక్కించే అందాల్ని రాశిగా పోసిన చందంగా క‌నిపిస్తోంది ఈ లుక్ లో. ఫ్లోర‌ల్ డిజైన్ దుస్తుల్లో రాశీ ఖ‌న్నా చాలాసార్లు ఫోజులిచ్చింది. మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం రాశీఖ‌న్న గోపీచంద్ స‌ర‌స‌న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. దీనికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. అక్టోబ‌ర్ లో సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే  అక్కినేని వార‌సుడు నాగ‌చైత్య స‌ర‌స‌న `థాంక్యూ ` చిత్రంలో న‌టిస్తోంది.  విక్ర‌మ్. కె. కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.   తెలుగు లో ఈ రెండు మిన‌హా   కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో న‌టిస్తుంది
Tags:    

Similar News