రామ్ కష్టం ముందు నాదెంత?

Update: 2015-09-29 13:30 GMT
‘శివమ్’ సినిమా చేయడానికి ముందు వరకు తాను చాలా హార్డ్ వర్కర్ అనుకునేదాన్నని.. కానీ ఆ సినిమా చేశాక తన అభిప్రాయం మారిపోయిందని అంటోంది రాశి ఖన్నా. ఇంతకీ ఆమె అభిప్రాయం ఎందుకు మారిపోయిందీ అంటే..

‘‘నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను అనుకునే దాన్ని. కానీ రామ్ ను చూశాక ఆ అభిప్రాయం మార్చేసుకున్నా. సినిమా కోసం అంత కష్టపడటం నా వల్ల కాదు. రామ్ నాలో స్ఫూర్తి నింపాడు. అలాంటి కథానాయకుడితో పని చేయడం ఎవరికైనా సవాలే. రామ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా కష్టమైన స్టెప్పులు ఇలా నేర్చుకుని అలా చేసేసేవాడు. నాకేమో అంత సులువుగా వచ్చేవి కావు. చాలా సేపు రిహార్సల్స్ చేసేదాన్ని. రామ్ చాలా ఓపిగ్గా వెయిట్ చేసేవాడు’’ అంటూ తన హీరోపై ప్రశంసలు కురిపించింది రాశి.

‘శివమ్’ సినిమాకు సంబంధించి కథ, తన  పాత్ర తనకు చాలా ఎగ్జైట్ మెంట్ ఇచ్చాయని.. చాలా ఇగో ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానని రాశి చెప్పింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూనే ఉంటారని.. ముఖ్యంగా క్లైమాక్స్ హైలైట్ గా ఉంటుందని.. షూటింగ్ చేస్తున్నంతసేపూ తాను నవ్వుతూనే ఉన్నానని.. ఆ సమయంలో తనకెవరైనా లాఫింగ్ గ్యాస్ ఏమైనా కొట్టారేమో అని యూనిట్ లో జనాలు జోకులేసుకున్నారని రాశి చెప్పింది.
Tags:    

Similar News