ఒక హీరోయిన్‌ను ఒక సినిమాలోకి తీసుకుంటున్నారంటే.. కేవలం ఆమె పాపులార్టీని బట్టే కాదు.. అసలు సినిమా బడ్జెట్ ను రికవర్ చేయడానికి ఆమె ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఫ్యాక్టర్‌ను కూడా చూసుకునే. అలా చూస్తే ఖచ్చితంగా హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంతవరకు పెట్టొచ్చు అనే విషయం చాలామంది హీరోలూ నిర్మాతలూ ముందే ఫిక్సు చేసేస్తారు. మినిమం 50 కోట్ల మార్కెట్ ఉంటుంది కాబట్టి.. మహేష్ బాబు సినిమాలో కోటి రూపాయలు ఇచ్చి కాజల్ ను పెట్టుకోవచ్చు.. కాని 20 కోట్ల లోపే బడ్జెట్ ఉన్న రామ్ పరిస్థితి అలా కాదుగా. సరిగ్గా ఈ లెక్క మీదనే కొట్టిందట హీరోయిన్ రాశి ఖన్నా.
'నేను శైలజ' సినిమా తరువాత ఏం చేయాలా అంటూ చాలా ఆలోచించుకుని.. ఇప్పుడు తన 'కందిరీగ' డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమాను చేయడానికి సిద్దపడ్డాడు రామ్. ఏ యాంగిల్లో చూసినా కూడా ఇది మరో కమర్షియల్ మసాలా సినిమాయే కాబట్టి.. దీనిని మాంచి మసాలా హీరోయిన్ ఒకరు కావాలి. అందుకే తమన్నా కాని.. లేకపోతే రకుల్ ప్రీత్ కాని అనుకున్నారట. కాకపోతే టాప్ రేంజుకు వెళ్ళిన రకుల్ కోటి అడగటం.. ఫ్లాపులు తప్ప భారీ హిట్లే లేని తమన్నా కూడా దాదాపు అంతే అడగటంతో.. రామ్ షాకు తిన్నాడట. ఎందుకంటే ఈ సినిమాను బడ్జెట్ కంట్రోల్ చేసి తీయాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి. ఆ టైములో 30 లక్షలు చాలా అంటూ ముందుకు రావడంతో.. వెంటనే రాశి ఖన్నాను హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. అలా అమ్మడు రెమ్యనరేషన్ తో పడేసిందనమాట.
గతంలో రామ్ అండ్ రాశి.. 'శివం' అనే మూవీలో కలసి నటించారు. ఆ సినిమా ఫ్లాపైంది.