రాశిఖ‌న్నా రేంజ్ పెరిగిందా?!

Update: 2015-09-10 05:14 GMT
స్టార్ స్టేట‌స్ ఉన్న హీరోల‌తోనే న‌టించాల‌ని డిసైడైన‌ట్టుంది రాశిఖ‌న్నా. అందుకే చిన్న చిత‌కా ఆఫ‌ర్ల‌ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలుస్తోంది. రెమ్యున‌రేష‌న్  బ‌లంగా ఇస్తామ‌న్నా స‌రే... నో చెప్పేస్తోంద‌ట‌. గోపీచంద్‌ లాంటి హీరోతో హిట్టందుకొని...  రవితేజ, రామ్‌ లాంటి క‌థానాయ‌కుల‌తో న‌టిస్తోంది కాబ‌ట్టి రాశిఖ‌న్నా కాస్త వేచిచూద్దామ‌నే ధోర‌ణిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. చేతిలో ఉన్న రెండు సినిమాలూ హిట్ట‌యిపోతే ఇక తానూ స్టార్‌ ని అయిపోయిన‌ట్టే క‌దా... మ‌ధ్య‌లో చిన్న సినిమాలు ఒప్పుకోవ‌డం ఎందుకు అంటూ వ‌చ్చిన అవ‌కాశాల్ని వ‌దులుకొంటున్న‌ట్టు తెలుస్తోంది.    ఇటీవ‌ల ప్రముఖ హీరో  సినిమాలో న‌టించ‌మ‌నే ఆఫ‌ర్ రాశిఖ‌న్నా ద‌గ్గ‌రికి వెళ్లింద‌ట‌. కానీ రాశిఖ‌న్నా మాత్రం ఆయ‌న సినిమాకి కూడా నో చెప్పేసింద‌ట‌. రెమ్యున‌రేషన్ ఎంత‌కావాలో అడగ‌మ‌న్నా స‌రే `కాదులెండి` అని చెప్పి పంపించింద‌ట‌. దీంతో ఆ  హీరో స‌ర‌స‌న ఓ న్యూజిలాండ్ భామ‌ని ఎంపిక చేసేశారు.  

రాశిఖ‌న్నా చిన్న సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. చిన్న సినిమాతోనే హిట్టు కొట్టింది. ఆ త‌ర్వాత నుంచి  ప‌రిశ్ర‌మని బాగా చ‌దివేసింది. `జిల్‌`తో ఆమెకి ఎప్పుడైతే గుర్తింపొచ్చిందో అప్ప‌ట్నుంచి త‌న రేంజ్ పెరిగింద‌ని భావిస్తోంద‌ట రాశి. ఇక నుంచి ఆ రేంజ్‌ కి త‌గ్గ సినిమాల్నే ఎంపిక చేసుకోవాల‌ని డిసైడైయ్యింద‌ట‌. చేతిలో ఉన్న సినిమాలు హిట్ట‌యితే స‌రే స‌రి. అదే ప‌రిస్థితి అటు ఇటుగా త‌ల‌కిందుల‌య్యింద‌నుకో.. అప్పుడు ప‌రిస్థితేమిటో ఊహించ‌డం లేదు రాశిఖ‌న్నా. అయినా అయా సినిమాల్లో న‌టిస్తున్న ఆమెలో ఎంత కాన్ఫిడెన్స్ లేక‌పోతే ఇలా వ‌చ్చిన అవకాశాల్ని వ‌ద్దనుకొంటుంది. రాశిఖ‌న్నా చేతిలో ఉన్న సినిమాలు స‌క్సెస్ కావాల‌నే కోరుకొందాం, ఆమె కూడా స్టార్ లీగ్‌ కి వెళ్లిపోవాల‌నే ఆశిద్దాం...
Tags:    

Similar News