అభిమాని ఇంటికి రావడంపై రష్మిక కామెంట్స్‌

Update: 2021-06-28 06:30 GMT
తెలుగు లో ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా గీత గోవిందం సినిమా తో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం సౌత్‌ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ఇంతటి బిజీ హీరోయిన్‌ కు అభిమానులు తక్కువేం కాదు. గీత గోవిందంలో ఈమెను చూసిన తర్వాత ఎంతో మంది ఈమెను అభిమానిస్తున్నారు. సినిమా సినిమాకు అభిమానులు పెరిగి పోతూనే ఉన్నారు. అభిమానులతో ఆనందమే కాకుండా కొన్ని సార్లు అసహనం కూడా కలుగుతుంది. తాజా సంఘటన రష్మికకు కాస్త అసహనం కలిగించిందట.

వారం రోజుల క్రితం ఒక తెలుగు వ్యక్తి రష్మిక అడ్రస్‌ వెదుక్కుంటూ కర్ణాటక వెళ్లాడు. అతడు నెట్‌ లో రష్మిక అడ్రస్‌ ను కొట్టి ఆమె ఇంటి కోసం రాత్రి అంతా వెదుకుతూనే ఉన్నాడట. స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి అతడిని పట్టుకు వెళ్లారు. రష్మిక ను కలవాలనే తాను వచ్చానంటూ కర్ణాటక పోలీసులకు చెప్పాడు. ఆ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ విషయం పై రష్మిక ఎలా స్పందిస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు వారం రోజుల తర్వాత రష్మిక స్పందించింది.

ఇప్పుడే నా దృష్టికి ఈ విషయం వచ్చింది. నన్ను కలిసేందుకు ఇలాంటి పనులు అస్సలు చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. అలా చేయడం నాకు నచ్చడం లేదు. ఈ సమయంలో నేను ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ఏదో ఒక రోజు మనం అంతా కలుస్తాం. అప్పటి వరకు వెయిట్‌ చేయండి. మళ్లీ ఎవరు కూడా నన్ను వెదుక్కుంటూ ఇంటి వరకు రావద్దంటూ విజ్ఞప్తి చేసింది. రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోంది. తెలుగులో నానితో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక తమిళం.. కన్నడం మరియు హిందీలో కూడా ఈమె సినిమా లు చేస్తోంది. ఇతర భాషల్లో ఎన్ని చేసినా తెలుగు లోనే ఈమెకు క్రేజ్‌ ఎక్కువగా ఉంది.. ఇక్కడే స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది.
Tags:    

Similar News