మెంట‌లెక్కిస్తున్న టీవీ యాంక‌ర్

Update: 2018-11-08 07:41 GMT
టీవీ యాంక‌ర్ - హీరోయిన్ రష్మి గౌతమ్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ద‌శాబ్ధ కాలంగా ఈ రంగాల్లో ర‌ష్మి దూకుడు సాగిస్తూనే ఉంది. ముంబై భామ‌లు - మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ల వెల్లువ‌లో ఈ తెలుగ‌మ్మాయికి ఆశించినంత పెద్ద కెరీర్ టాలీవుడ్‌ లో క‌ష్ట‌మైంది. అయినా త‌న‌కంటూ కొన్ని అవ‌కాశాల్ని సృష్టించుకుని నిర్మాత‌ల పాలిట క‌న‌క‌మ‌హాల‌క్ష్మి అని నిరూపించుకునే ప్ర‌య‌త్నలో ర‌ష్మి నిరంత‌రం వార్ న‌డిపిస్తూనే ఉంది. ఓవైపు జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌ గా రాణిస్తూనే - మ‌రోవైపు సినిమాల‌తోనే ఆదాయం ప‌రంగా ఎలాంటి స‌మస్యా లేకుండా మ్యానేజ్ చేస్తోంది.

వాస్త‌వానికి ర‌ష్మి ఇప్పుడున్న నాయిక‌లంద‌రికంటే టాలీవుడ్‌ లో చాలా సీనియ‌ర్. 2002 లో `సవ్వడి` అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన `హోలీ` సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే టీవీ సీరియల్ లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన `ప్రస్థానం` చిత్రంలో రష్మి సహాయనటిగా మెప్పించింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళంలో వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి - తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఆ త‌ర్వాత ప‌య‌నం గురించి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు గుంటూర్ టాకీస్ చిత్రంతో వాడి వేడి ఉన్న ఒగ‌లుమారి నాయిక‌గా మైమ‌రిపించింది. 2016లో రాణిగారి బంగ్లా - అంతం - త‌ను వ‌చ్చెనంట వంటి చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం మ‌రిన్ని సినిమాల్లో అవ‌కాశాలొచ్చినా వాటి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉందింకా.

నిన్న‌టిరోజున దీపావ‌ళి సంద‌ర్భం గా ర‌ష్మి సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల కోసం అదిరిపోయే స్టిల్‌ ని షేర్ చేసింది. ఈ లుక్ రియ‌ల్లీ స్పైసీ.. హాట్ అప్పియ‌రెన్స్‌ తో మైమ‌రిపిస్తోంది. నాభి సౌంద‌ర్యం - న‌య‌గ‌రా ఒంపుల్ని ఆరాంగానే ప‌రిచేసింది ఈ లుక్‌ లో. ముంబై - మ‌ల‌బార్ వ‌ర‌ల్డ్‌ కే మ‌తి చెడే అందందాలు - గ్లామ‌ర్‌ నాలో ఉన్నాయి. అయినా ఎందుకు నాకు పెద్ద రేంజు ఛాన్సులివ్వ‌రూ? అని మ‌న ద‌ర్శ‌క‌నిర్మాతల్ని నిల‌దీస్తున్న‌ట్టే ఉందీ ఫోజు. క‌నీసం ర‌ష్మీ రేంజును పెంచే ఒక్క‌టి పడే వ‌ర‌కే ఈ తంటాల‌న్నీ. అటుపై వెనుదిరిగి చూసే అవ‌స‌ర‌మే రాదంతే!



Tags:    

Similar News