జై - రష్మి జంటగా నటించిన 'అంతకు మించి` చిత్రం ఆడియో లాంచ్ సందర్భంగా `ఆర్ ఎక్స్ 100` దర్శకుడు అజయ్ భూపతి చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 'అంతకు మించి' పోస్టర్ లో రష్మి తొడలు - వెనుక సముద్రం సీన్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని అజయ్ భూపతి హాట్ కామెంట్స్ చేశారు. దీంతో, అజయ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపించారు. ఆ వ్యాఖ్యలపై రష్మి కూడా స్పందించకపోయే సరికి ఆమె ఫీల్ అయిందని నెటిజన్లు అనుకున్నారు. అయితే, అజయ్ కామెంట్స్ పై తాజాగా రష్మి పాజిటివ్ గా స్పందించింది. తమ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు అజయ్ కు రష్మి ధన్యవాదాలు తెలిపింది. అజయ్ ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పడంతో పాటు ఆ పోస్టర్ తో కనెక్ట్ అయినందుకు అజయ్ భూపతికి థాంక్స్ కూడా చెప్పింది.
సినిమా అనేది ఏ ఒక్కరి కష్టం కాదని - ఓ సినిమా వెనుక రాత్రింబవళ్లు ఎంతో మంది సమిష్టి కృషి ఉంటుందని రష్మి చెప్పింది. తమ సినిమా పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టిందని - నిర్మాతలపై చాలా ఒత్తిడి ఉందని చెప్పింది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన నిర్మాతల ముఖంలో సంతోషం కనిపించడం ఆనంందాన్నిచ్చిందని రష్మి తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ డేట్స్ - తన టీవీ షోల డేట్స్ కు చాలా సార్లు క్లాష్ అయిందని - రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అలసిపోయేదాన్నని చెప్పింది. అటువంటి సమయంలో డైరెక్టర్ చెప్పే సలహాలు తనకు ఎంతో ఎనర్జీని ఇచ్చాయని తెలిపింది. ఈ సినిమాలో డూప్ లేకుండా చాలా స్టంట్స్ చేశానని, మంచి స్టోరీ ఉన్న ఈ చిత్రంలో అందరికీ పెర్ఫార్మెన్స్ కు చాలా స్కోప్ ఉందని తెలిపింది. టైటిల్ కు తగ్గట్లుగానే ఈ సినిమాలో ఆశించినదానికి `మించి` ఉంటుందని చెప్పింది. ఎ.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 24న విడుదల కాబోతోంది.