ప్రేమికులకు రష్మి జబర్దస్త్‌ సలహా

Update: 2021-02-05 00:30 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ రష్మికి జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఆమె లాక్ డౌన్ సమయంలో కుక్కలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నాలంటూ ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని వీధి కుక్కలకు ఆహారం సప్లై చేయడం మనం అంతా చూశాం. వీధి కుక్కలను చాలా మంది చీదరించుకుంటారు. కాని రష్మి మాత్రం వాటికి ఆహారం పెట్టి వాటిని కాపాడే ప్రయత్నం చేసింది. ఆమె మంచి మనసుకు ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

త్వరలో వ్యాలెంటైన్స్ డే రాబోతుంది. చాలా మంది వారి లవర్స్ కు పెట్‌ డాగ్స్ ను బహుమానంగా ఇవ్వాలనుకుంటూ ఉంటారు. డాగ్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉండేవి కాదు. దాదాపుగా 20 ఏళ్ల పాటు అవి మనతో ఉండి పోయేవి. అందుకే వాటిని బహుమానంగా ఇచ్చే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. వాటిని సాకడం చాలా తతంగం ఉంటుంది. దానికి తోడు ఒక వేళ బ్రేకప్ అయితే వాటిని రోడ్డున పడేస్తారు. అందుకే ప్రేమికుల రోజున ప్రేమికులు ఎవరు కూడా పెట్‌ డాగ్స్ ను కాని ఇతర జంతువులను కాని బహుమానంగా ఇవ్వ వద్దంటూ సలహా ఇచ్చింది. రష్మి ఇచ్చిన ఆలోచించదగ్గదే కదా అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News