కొంటె చూపుల‌ కోనంగి ఈ నెర‌జాన‌

Update: 2021-11-28 02:30 GMT
ర‌ష్మిక మంద‌న్న కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో క్రేజ్ ఉన్నంత కాలం సినిమాలు చేసుకుని చివ‌రిగా బాలీవుడ్ కి వెళ్లి స్థిర‌ప‌డే ఆలోచ‌న చేస్తోంది. దీపం ఉండ‌గానే ప్ర‌తిదీ చ‌క్క‌దిద్దుకుంటోంది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎందిగింది. తెలుగు సినిమాలే టార్గెట్ గా ప‌నిచేస్తోంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులందుకుంటోంది. ఇదే క్ర‌మంలో బాలీవుడ్ ని రౌండప్ చేస్తోంది. బాలీవుడ్ త‌ర్వాత అతిపెద్ద ఇండ‌స్ట్రీగా టాలీవుడ్ కి పేరుంది. అందుకే ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లో తెలివిగా పావులు క‌దుపుతోంది.

ఇక స్టార్ గా కెరీర్ ని బిల్డ్ చేసుకునే క్ర‌మంలో క‌న్న‌డ హీరో రోహిత్ శెట్టితో ప్రేమ‌కు బ్రేకప్ చెప్పేయ‌డం తెలిసిందే. దీనిపై విమర్శ‌లు తెర‌పైకి వ‌చ్చినా..వాటిని ఎంత మాత్రం ప‌ట్టించుకోకుండా ముందుకు సాగిపోతోంది. బాలీవుడ్ లో `మిష‌న్ మ‌జ్ను` చిత్రంతో లాంచ్ అవుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. అలాగే `గుడ్ బై` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇక తెలుగులో పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`లో న‌టిస్తోంది. అలాగే `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఈ రెండు మిన‌హా కొత్త క‌మిట్ మెంట్లు ఏవీ లేవు. బాలీవుడ్ లో మాత్రం మ‌రో రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

ఇక సోష‌ల్ మీడియాలో ర‌ష్మిక చలాకీత‌నం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ పై దృష్టి పెట్ట‌డంతో రెగ్యుల‌ర్ గా ఇన్ స్టాలో వైబ్రేష‌న్ క్రియేట్ చేస్తూనే ఉంది. తాజాగా ర‌ష్మిక‌ కొత్త ఫోటో షూట్ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఇందులో ర‌ష్మిక డిజైన‌ర్ ఫ్యాంట్.. బ్లౌజ్ ధ‌రించింది. సీరియ‌స్ గా కొంటె చూపుల‌తో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News