తన పేరునే హ్యాష్ ట్యాగ్ చేసిన రష్మీ

Update: 2018-07-18 06:37 GMT
పేరులోనే ఏముంది అని మనం అనుకుంటాం.. కానీ ఆ పేరుకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు.. చాలా మంది తమ పేరుతో కలిసి రావడం లేదని కొన్ని ఎక్స్ ట్రా పదాలను యాడ్ చేసి పేరు మార్చుకున్న వారు ఉన్నారు. న్యూమరల్ పేరుతో ఇప్పుడు కొందరు మార్కెట్ లో ఇదో బిజినెస్ గా కూడా వ్యాపింపచేస్తున్నారు. ఇలా పేరుకున్న ప్రాముఖ్యతను సెంటిమెంట్ గా భావిస్తున్న వారిలో యాంకర్ కం హీరోయిన్ రష్మీ కూడా చేరింది.

జబర్దస్త్ తో పాటు సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. స్మాల్ స్క్రీన్ తో పాటు సిల్వర్ స్క్రీన్ పై కూడా హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. కానీ సినిమాలు ఆమెకు కలిసి రాలేదు. ఒక సినిమా హిట్ అయినా రష్మీకి మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో ఈ నటి బుల్లితెరనే నమ్ముకుంది.

తాజాగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. అందరూ తనను ‘రేష్మీ’ అని పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  తన పేరును తానే ‘హ్యాష్ ట్యాగ్’ చేసుకుంటూ అందుకు గల కారణాలను వివరించింది.

‘రష్మీ గౌతమ్ అనే నా పేరును నేనే హ్యాట్ ట్యాగ్ చేసుకున్నాను.. ఎందుకంటే చాలా మంది నన్ను ‘రేష్మి’ అని పిలుస్తున్నారు.. ’ అంటూ తన అసలు పేరుపై వివరణ ఇచ్చుకుంది. ఇటీవలే జరిగిన ఓ షోలో తన పేరుపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో పేరును ప్రకటించింది. పేరు మారిస్తే ఏదైనా అదృష్టం వరిస్తుందని ఎవరైనా చెప్పారో.. లేదా.? తనే తెలుసుకుందో కానీ.. రష్మీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News