నా లైఫ్ ని కంట్రోల్ చేయకండి'.. పేరెంట్స్ కు తెగేసి చెప్పిన రష్మిక..!

Update: 2022-10-08 11:36 GMT
'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కిరిక్ పార్టీ బ్యూటీ రష్మిక మందన్నా.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇక 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న ఈ దక్షిణాది ముద్దుగుమ్మ.. మరోవైపు బాలీవుడ్ పై ఫోకస్ పెడుతూ ముందుకు సాగుతోంది.

రష్మిక మందన్నా 'గుడ్ బై' అనే చిత్రంతో హిందీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ - నీనా గుప్తాలు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అమితాబ్ కూతురుగా రష్మిక కనిపించింది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నిన్న (అక్టోబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'గుడ్ బై' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత మరియు ఫ్యామిలీ విషయాలను పంచుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం గురించి.. కుటుంబం మరియు వర్క్ లైఫ్ మధ్య ఒక లైన్ ను ఎలా గీయాలి అనే దాని గురించి మాట్లాడింది.

సినీ ఇండస్ట్రీ గురించి తన తల్లిదండ్రులు చాలా భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని.. తాను మొదటి సారి సినిమాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు తన పేరెంట్స్ వద్దని చెప్పారని.. కఠినమైన మార్గంలోనే నేర్చుకోవాల్సి వచ్చిందని రష్మిక చెప్పుకొచ్చింది.

తన తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందిన వారు కానందున.. వారు తన పని వ్యవహారాల్లో ప్రమేయం చేసుకోకూడదని అన్నింటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడంలో కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నట్లు రష్మిక తెలిపింది. ఒకరి పని వ్యవహారాల్లో మరొకరు తలదూర్చాల్సిన అవసరం లేదని తనకు, తన కుటుంబ సభ్యులకు ఇప్పుడు అర్థమైందని వెల్లడించింది.

వాళ్లు నాకు ఎప్పటికీ తోడుగా ఉంటారు. కానీ నేను చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నప్పుడు ఆ ప్రపంచంలో ఎలా ఉండగలవు? అని అన్నారు. నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలనేది నాకు తెలుసు అని రష్మిక తెలిపింది. నేను నా స్వంత ఎంపికలను చేసుకోనివ్వండి.. నా జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నించవద్దు.

ఎందుకంటే ప్రపంచం మీరు అనుకున్న విధంగా లేదు. ఇది నేను వాళ్లకు నేర్పించాను. వాళ్ళకి కంఫర్టబుల్ గా చెల్లెలిని చూసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా గడపొచ్చు. ఇక్కడ నేను ఒక ఆర్టిస్టుగా నా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఇది మా అందరికీ ఒక ప్రయాణం మరియు పాఠం లాంటిది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

అయితే కుటుంబంతో ఉండలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని రష్మిక పేర్కొంది. నాకు 8 ఏళ్ల చిట్టి చెల్లెలు కూడా ఉంది. నా చెల్లెలి ఎదుగుదలను చూడలేకపోతున్నాను. అయితే నాకు ఫ్యామిలీ నుంచే కాదు. బయటి నుంచి కూడా అంతే ప్రేమ వస్తోంది. నేను వారికి కూడా జవాబుదారీనే. బయట ఉన్న వారి కోసం మా కుటుంబం చేస్తున్న త్యాగం ఇది.

నేను ఎక్కువగా హాస్టల్స్‌ లో ఉన్నాను. అందుకని నా తల్లిదండ్రులకు దూరంగా ఉండటం నాకు పెద్ద సమస్య కాదు. నాకు చెల్లెలు పుట్టిన తర్వాత కూడా ఇలా దూరంగా ఉండటం అనేది బాగోలేదు. తను పుట్టినపుడు తనను ఎంతో బాగా చూసుకున్నాను. పాలు తాగించేదాన్ని, డైపర్స్‌ మార్చే దాన్ని, స్నానం చేయించేదాన్ని. నిజంగా చెప్పాలంటే నేను తన రెండో తల్లిని. అలాంటిది తనకు దూరంగా ఉంటూ వస్తున్నాను. అదే నన్ను చాలా బాధిస్తోంది అని రష్మిక ఎమోషనల్ గా చెప్పింది.

ఇకపోతే రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను' అనే సినిమా చేస్తోంది. రణ్‌ బీర్ కపూర్‌ సరసన 'యానిమల్' అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. మరోవైపు విజయ్ తో 'వారసుడు' అనే తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తోంది. ఇదే క్రమంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' చిత్రంలో భాగం కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News