ఒక్క ఛాన్స్ చాలా దూరం తీసుకెళుతుంది. ఒకసారి సక్సెస్ దరికి చేరితే ఇక దానిని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు నేటితరానికి పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా నిరూపించింది రష్మిక మందన. సక్సెస్ అయ్యేది చాలా తక్కువమంది అయినా .. టైమ్...లక్..హార్డ్ వర్క్.. ట్యాలెంట్ అన్ని కలిసివచ్చి రష్మిక పెద్ద స్థాయికి ఎదిగేసింది.
హీరోయిన్ల విషయానికి వస్తే రష్మిక కెరీర్ ప్లానింగ్ చాలా తెలివిగా సాగుతోందని విశ్లేషిస్తున్నారు. నిజానికి నాయికల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. నేమ్ ఫేమ్ ఉన్నంతకాలమే మార్కెట్ లో చలామణి అవుతారు. ఈలోపు అన్నింటికి చక్కబెట్టాలి. చాలా అరుదుగా మాత్రమే గొప్ప నటీమణులుగా కీర్తింపబడతారు. అలాంటి వారిలో బాలీవుడ్ లో పాగా వేసి..అక్కడి ఇండస్ట్రీని ఏలిన వారిలో కన్నడ భామలదే అగ్రభాగం అని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే స్ట్రీక్ ని రష్మిక కంటిన్యూ చేస్తోంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి..అక్కడ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుంది ఐశ్యర్యా రాయ్. వివాహానికి ముందు బాలీవుడ్ తెరపై నటిగా ఎన్నో సంచలనాలు నమోదు చేసారు. వైవాహిక జీవితం తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత కన్నడ నుంచి వెళ్లి ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించి దీపికా పదుకొణే. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి బాలీవుడ్ నే నేడు ఏలే స్థాయికి చేరారు. చివరికి స్టార్ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. వాళ్లిద్దరు ఈ స్థాయిలో స్థిరపడటానికి కారణం తమ కమిట్మెంట్..డెడికేషన్..ట్యాలెంట్..లక్ మాత్రమే.
ఇప్పుడు ఇదే దారిలో రష్మిక మందన కూడా పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. అనుకోకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు- కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ అయింది. ఇక మిగిలింది బాలీవుడ్ మాత్రమే. ఈ యువ నాయిక అక్కడ ఓ వెలుగు వెలిగి..చివరిగా అక్కడే ఐశ్వర్యా రాయ్- దీపిక పాదుకోణే లా స్థిరపడాలని బిగ్ స్కెచ్ వేసిందట.
`మిషన్ మజ్ను` సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రాతో రొమాన్స్ చేస్తోంది. అలాగే `గుడ్ బై` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో ఏకంగా లెజెండ్ అమితాబ్ తో కలిసి నటించేస్తోంది. తెలుగు- కన్నడ భాషల్లో వచ్చిన అవకాశాల్ని సైతం పక్కనబెట్టి అమ్మడు బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు చేస్తోంది. అలాగే మరో రెండు హిందీ చిత్రాలకు ఇటీవల సంతకాలు చేసి మరో లెవల్ కి చేరుతున్నానని రష్మిక వెల్లడించింది. ఈ స్పీడ్ చూస్తుంటే... సీనియర్ హీరోయిన్ల తరహాలోనే విజయ శిఖరాల్ని అధిరొహిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
రష్మిక ఇటు తెలుగు- తమిళ పరిశ్రమల్ని కూడా విడిచిపెట్టే ఆలోచనలో లేదు. తెలుగులోనూ శర్వానంద్ సరసన ఓ చిత్రం చేస్తోంది. బన్ని పుష్ప డ్యూయాలజీలోనూ కథానాయికగా నటిస్తోంది. అలాగే తమిళంలో అగ్ర హీరోల సరసన అవకాశాలొస్తే నటించేందుకు సిద్ధంగా ఉందిట. ఒకేసారి తెలుగు-తమిళం-హిందీలో మూడుముక్కలాట ఆడేస్తుందట. ఇక ఇదే స్పీడ్ లో పలు కమర్షియల్ ప్రకటనల్లోనూ నటించేందుకు బిగ్ డీల్స్ సెట్ చేసుకుంటోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రష్మిక లైనప్ లో తదుపరి చరణ్ .. ప్రభాస్ .. ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఉన్నారు. అటు కోలీవుడ్ లో విజయ్.. విజయ్ సేతుపతి .. శివకార్తికేయన్ వంటి స్టార్ల సరసన నటించాలన్న ఆసక్తిని రష్మిక ఇంతకుముందు వ్యక్తం చేసింది.