నందమూరి బాలకృష్ణ ఏ భాషలో అయినా డైలాగ్ లు దంచేయగలరు. ఆయన ఇతర భాషలో పద్యం చెప్పినా.. డైలాగ్ చెప్పినా దబిడి దిబిడే ... అంతలా పాపులర్ అయిపోతుంది. అందుకే బాలయ్య చెప్పే డైలాగ్ లని థియేటర్లలో అభిమానులు అంతగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆయన `ఆహా` ఓటీటీ `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే` కోసం చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య నదైన శైలిలో కార్యక్రమాన్ని హోరెత్తించేస్తున్నారు.
తాజాగా రవితేజ తో చేసిన రచ్చ నవ్వులు పూయించింది. తాజాగా `పుష్ప`తో పాన్ ఇండియా స్థాయి సక్సెస్‌ని సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్, చిత్ర హీరోయిన్ రష్మిక మందన్నలతో బాలయ్య ప్రత్యేకంగా చిట్ చాట్ ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక ని ఇంప్రెస్ చేయడానికి బాలయ్య చేసిన కన్నడ పద ప్రయోగాలు నవ్వులు పూయిస్తున్నాయి.
చెలువెళ్లి బేలూర బల్లే...బాలే మనసల్లి మైసూరమల్లె...నుడియల్లి కస్తూరి..నడియల్లి కావేరి..శోభనగల్లి మడిక్కిరి...నాట్యదల్లి మయూరి..గొడిగిన పేటకి కర్ణాటక కుడి...అంటూ రష్మికని ఇంట్యడ్యూస్ చేయడం కోసం బాలయ్య పడి పాట్లు అన్నీ ఇన్నీ కావు. నువ్వు నవ్వుతుంటే ఏంటీ ఇంత అందంగా వున్నావ్?..బన్నీ చందనం..ఈ అమ్మాయి చందమామ.. ఇద్దరినీ తీసుకెళ్లి అడవిలో పడేశావు సుక్కు..అడవి కాచిన వెన్నెల...మధ్యలో రష్మిక హావభావాలు పలికిస్తూ `నేను బాగున్నానని.. అనగానే వెంటే బాలయ్య నేను బాగున్నానా? అని అనడం..
సీతారామశాస్త్రి గారు చందమామ మనకందదని ఓ పాట రాశారు. కానీ ఈ చందమామ నాకు అందేస్తోంది అంటూ రష్మికని ఉద్దేశించి బాలయ్య అన్న మాటలకు ఆడియన్స్ గొల్లున నవ్వేశారు. ఓ పక్క బ్యూటీ మరో పక్క బ్రెయిన్ అన్నారు... నువ్వేమో బ్రెయిన్ .. అవిడేమో బ్యూటీ..అబ్బా బ్యూటీనే కంఫర్టబుల్ నాకు అని బాలయ్య అనడంతో సుకుమార్ ,రష్మిక కూడా నవ్వేయడం ఆకట్టుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే రష్మికని ఇంప్రెస్ చేయడం కోసం వీడియో ప్రారంభంలో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఇక కన్నడంలో రష్మికని వర్ణిస్తూ బాలయ్య చేసిన హంగామా అల్లాడించిందని చెప్పొచ్చు. బాలయ్య స్పీడుకి రష్మిక నవ్వుల్లో మునిగిపోయిందంతే. మరి రష్మిక తనకు నచ్చిందన్న బాలయ్య తనతో నటించమని ఈ షోలోనే ఆమెకు ఆఫర్ ఇచ్చినా ఇచ్చేస్తాడని, అమ్మాయిలని ఐస్ చేయడం ఎలాగో బాలయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని కొంత మంది ఫ్యాన్స్ తాజా వీడియోని షేర్ చేస్తూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.