బెంగళూరు నగరంలో సౌత్ ఈస్ట్ దిశగా ఉన్న బెల్లందూరు చెరువు చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే కాలుష్య కాసారంగా మారిన ఆ చెరువు నుండి కాలుష్య పు నురుగు పది అడుగుల ఎత్తుగా లేస్తుంది. ఒక్కో సారి అది చెరువు పక్క నున్న రోడ్ల పైకి కూడా వస్తుంది. రష్మిక మందన్న కారణంగా ఇప్పుడు బెంగుళూరు మాత్రమే కాకుండా సౌత్ ఇండియా అంతా ఈ చెరువు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.
కారణం ఏంటంటే.. రష్మిక ఈ చెరువులో చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం సృష్టించింది. ఈ చెరువులోని కాలుష్యం గురించి అందరికీ తెలిపేందుకు రష్మిక చేసిన పనిని చాలామంది మెచ్చున్నారు. ఫ్యాన్స్ మాత్రం అలాంటి చెరువు లో దిగితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అంటూ ఆందోళన చెందారు. కానీ కాస్త లేటుగా అసలు విషయం బయటకు వచ్చింది. విషయం ఎంటంటే.. రష్మిక నిజంగా ఆ చెరువులో దిగి ఫోటో షూట్ చేయలేదట. ఒక మంచి స్విమ్మింగ్ పూల్ లో ఫోటో షూట్ చేసిందట. ఆ ఫోటోలను ఫోటో షాప్ సహాయంతో బెల్లందూరు లేక్ ఫోటో లతో మిక్స్ చేసి విడుదల చేయడం జరిగిందట.
ఎదేతేనేం.. ఒక మంచి పని కోసం ఫోటో షాప్ చేసినా నష్టం లేదు. దీని కారణంగా అందరిలో అవేర్ నెస్ పెరిగి.. ప్రభుత్వంలో చలనం వచ్చి ఆ చెరువు బాగుపడితే అదే పదివేలు. అక్కడ బెల్లందూరు లేక్ లాగా మనకూ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ఉంది కదా ఎవరైనా ఫోటో షూట్ చేస్తే కాస్త అవేర్ నెస్ వస్తుంది కదా?