నవతరం భామల్లో రష్మిక మందన్న ఇస్పీడ్ గురించి తెలిసిందే. కెరీర్ ప్రారంభించిన చాలా తక్కువ సమయంలో పెద్ద సక్సెస్ సాధించిన నాయికగా రష్మిక పేరు మార్మోగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ని మ్యానేజ్ చేసేస్తోంది.
క్షణం తీరిక లేని బిజీ షెడ్యూల్స్ లోనూ జిమ్ యోగా అంటూ ఫిట్నెస్ ని విస్మరించదు ఈ బ్యూటీ. తరచూ వర్కౌట్ వీడియోలు ఫోటోలను తన సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తుంది. తాజా ఇన్ స్టా వీడియోలో కాస్త కఠినంగానే పుష్-అప్ లు చేస్తూ కనిపించింది. వ్యాయామం చేస్తున్నప్పుడు రష్మిక తన కండ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె తన తాజా పోస్ట్ లో త్వరలో రిలీజ్ కి వస్తున్న `వైల్డ్ డాగ్` బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. అలాగే బల ప్రదర్శనలో చిత్రబృందానికి ఛాలెంజ్ విసిరింది. దీనికి కింగ్ నాగార్జున ఇతర టీమ్ స్పందిస్తారేమో చూడాలి.
గత రెండు నెలలుగా రష్మిక ముంబైలో షూటింగ్ లో పాల్గొంటోంది. తన బాలీవుడ్ తొలి సినిమాలు మిషన్ మజ్ను- గుడ్ బాయ్ చిత్రాలతో బిజీగా ఉంది. మధ్యలో వీలు కుదిరినప్పుడు ముంబైలోని ఒక రెస్టారెంట్ లో గీత గోవిందం కోస్టార్ విజయ్ దేవరకొండతో కలిసి విందు కి వెళుతూ కెమెరాలకు చిక్కింది.
Full View