చిటికెలో అల్లుకుపోతుంద‌ట‌!

Update: 2018-10-16 01:30 GMT
టాలీవుడ్ తాజా సంచ‌ల‌నం ర‌ష్మిక‌. ఛ‌లో సినిమాతో ప‌రిచ‌య‌మైనా.. అమ్మ‌డి ఇమేజ్ ను ఎక్క‌డికో తీసుకెళ్లింది మాత్రం గీతాగోవింద‌మే. ఈ సినిమా త‌ర్వాత కుర్రకారు మ‌దిలో ర‌ష్మిక ఒక రేంజ్లో తిష్ఠేసింది. తీక్ష‌ణంగా చూసిన‌ట్లుగా ఉండే ఆమె కంటి చూపు ఇప్పుడు మ‌హా క్రేజ్ అయిపోయింది.

హీరోయిన్ కు ఉండాల్సిన గ్రేస్ కంటే.. ర‌ష్మిక చూసినంత‌నే.. గీత గుర్తుకు రావ‌టం.. గిలిగింత‌లు పెట్టేస్తున్నాయి. గీతా గోవిందం త‌ర్వాత దేవ‌దాస్ వ‌చ్చినా..  గీత గుర్తులు ఎంత‌కూ చెరిగిపోని ప‌రిస్థితి. తాజాగా నితిన్ తో ఒక మూవీ అలానే విజయ్ తో మరొక సారి జ‌త‌కట్టి డియ‌ర్ కామ్రేడ్ మూవీలో చేస్తోంది ర‌ష్మిక‌.

తాజాగా త‌న‌కు సంబంధించిన విష‌యాల్ని షేర్ చేసుకుంది. కొత్త విష‌యాల్ని నేర్చుకోవ‌టం.. కొత్త వ్య‌క్తుల‌తో క‌లిసి పోవ‌టం.. కొత్త ప్రాంతాల‌తో అనుబంధం పెంచుకోవ‌టం లాంటివి త‌న‌కు చిటికెలో పని అని చెబుతోంది. ఎలాంటి వాతావ‌ర‌ణంలో అయినా ఇట్టే అల్లుకుపోయే అల‌వాటు ఉండ‌టంతో త‌న‌కు సినిమాల్లో న‌టించ‌టం పెద్ద క‌ష్టంగా లేద‌ని చెబుతోంది.

సినిమాల‌తో డ‌బ్బు సంపాదించాల‌న్న యావ క‌న్నా.. మంచి పాత్ర‌ల్లో త‌న‌ను తాను చూసుకోవాల‌న్న దానికే తాను ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాన‌ని చెబుతోంది. కొత్త‌ను కొత్త‌గా ఫీల‌య్యే క‌న్నా.. అస‌లేం కొత్త కాద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంలో త‌న‌కున్న బ‌లంగా చెబుతోంది ర‌ష్మిక‌.
 
తాను ఒప్పుకున్న సినిమాకు సంబంధించి త‌న పాత్ర ఎలా ఉంటుంద‌న్న అంచ‌నాతో పాటు.. ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా తాను నేర్చుకోవాల్సిన అంశాల‌పై దృష్టి పెడ‌తాన‌ని చెప్పిన ర‌ష్మిక‌.. తాజాగా తాను చేస్తున్న డియ‌ర్ కామ్రేడ్ మూవీ కోసం క్రికెట్ నేర్చుకున్న‌ట్లు చెప్పింది. అంతేకాదండోయ్‌.. కొత్త విష‌యాల్ని చ‌టుక్కున నేర్చుకోవ‌టంలోనూ ర‌ష్మికకు చాలానే టాలెంట్ ఉంద‌ట‌.
Tags:    

Similar News