మిషన్ మజ్ను ప్రివ్యూ స్క్రీనింగ్ తర్వాత రష్మిక మందన్న వరస ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముంబై మీడియా ముందు రష్మిక హొయలు ప్రస్తుతం నెటిజనుల్లో ట్రెండీ టాపిక్ గా మారాయి. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ వీడియోలో తన ఫ్యాషన్ సెన్స్ తో ఇబ్బందికి గురవుతున్నట్టుగా కనిపించింది.
నిజానికి బాలీవుడ్ కల్చర్ కి ఇంకా రష్మిక అలవాటు పడలేదు. అక్కడ స్టార్ స్టడ్ క్యాట్ వాక్ భామలతో పోటీపడుతూ తన అందాలను ఆరబోయాలన్నా అది అంత సులువుగా కనిపించడం లేదు. ఇంతకుముందు గుడ్ బై సినిమా ప్రమోషన్స్ లోను రష్మిక ఫ్యాషన్ సెన్స్ పరంగా తడబడింది. సరైన ఎంపికలు కనిపించలేదు. అలాగే ఇప్పుడు మిషన్ మజ్ను ప్రచారంలోను ఇదే తడబాటు కనిపిస్తోంది. తాజాగా రష్మిక ఎంపిక చేసుకున్న డార్క్ బ్లూ టాప్ కొంత ఎబ్బెట్టుగానే కనిపిస్తోందనేది నెటిజనుల వాదన.
దానికి ఖాకీ రంగు డఫెల్ ఫ్యాంట్ అసలే సూట్ కాలేదు. ఫ్యాషన్ మిస్ ఫైరైంది. రష్మిక ఎంత ట్రై చేసినా ప్యారిస్ ఫ్యాషన్ హంసల్ని తలపించలేదు. కనీసం ముంబై క్యాట్ వాక్ భామలను కొట్టేయలేదు! అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో వీక్షించాక. రష్మిక సౌత్ యాటిట్యూడ్ ఉన్న ఒక నటి మాత్రమే. తనను తాను ఫ్యాషన్ క్వీన్ గా మలుచుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను స్క్రీనింగ్ లో కనిపించిన రష్మిక ఇలా వరుస ఫోటోషూట్లతో విరుచుకపడుతోంది. ఈ ప్రీమియర్ షోలో మృణాల్ ఠాకూర్- కరణ్ జోహార్- మనీష్ మల్హోత్రా- నిర్మాత అమన్ గిల్- నోరా ఫతేహి- రియా చక్రవర్తి- కిమ్ శర్మ- షరీబ్ హష్మీ కనిపించారు. వీళ్లతో పాటు సిద్ధార్థ్ తన ప్రియురాలు కియారా అద్వానీతో స్క్రీనింగ్ కు హాజరయ్యారు.
కథంతా లీక్ అయిందిగా..
మిషన్ మజ్ను 1970 కాలంలో సాగే గూఢచర్య థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో మల్హోత్రా సరిహద్దులో దేశాల అణు సామర్థ్యం గురించి కీలకమైన సమాచారాన్ని అందించడానికి పాకిస్థాన్ కి రహస్యంగా వెళ్లే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
వెకేషన్ లో శ్రీవల్లి హంగామా
రష్మిక మందన్న ఇటీవల వరుస షెడ్యూళ్లతో బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం ప్రచారంలోను అలసిపోతోందిట. అందుకే హాలిడేస్ జాలీడేస్ కావాలని కోరుకుంటోంది. త్వరలోనే వెకేషన్ కి వెళ్లానని నిర్ణయించుకున్నట్టు తాజాగా సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది. తాజా హాలిడే ట్రిప్ నుండి ఒక ఫోటో కూడా షేర్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View