అమ్మా... నాకు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి!

Update: 2018-10-07 11:14 GMT
‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన రష్మిక మందన్నా ‘గీత గోవిందం’ చిత్రంతో టాప్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం రష్మికకు రెండు సినిమాల్లో నటించే ఛాన్స్‌ దక్కింది. ఇంకా ఈమె వెనుక పలువురు నిర్మాతలు క్యూలోనే ఉన్నారట. ఇంత బిజీ షెడ్యూల్‌ కారణంగానే ఈమె తన పెళ్లి నిశ్చితార్థంను క్యాన్సిల్‌ చేసుకుందని - పెళ్లి చేసుకుంటే సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సి వస్తుందని రష్మిక ఇప్పటికే అయిన ఎంగేజ్‌ మెంట్‌ ను రద్దు చేసుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో కామెంట్‌ పడుతున్నాయి.

తన ప్రేమ - నిశ్చితార్థం - బ్రేకప్‌ ల విషయాల గురించి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లీయర్‌ గా రష్మిక సమాధానం ఇచ్చింది. రష్మిక మాట్లాడుతూ.. నా తల్లిదండ్రుల వద్ద నాకు పూర్తి స్వేచ్చ ఉంది. వారు నాకు అన్ని విధాలుగా స్వేచ్చను ఇవ్వడంతో పాటు, నా అభిప్రాయాలను గౌరవించారు. ముఖ్యంగా అమ్మతో నేను ఒక స్నేహితురాలిగా మెలుగుతాను. అమ్మను ఆట పట్టించడం - అమ్మతో జోకులు వేయడం చేస్తూ ఉంటాను. అందుకే జోక్‌ గా పలు సార్లు అమ్మతో.. అందరికి బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు - నాకు కూడా ఒక బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి అమ్మ అంటూ పదే పదే అమ్మతో అంటూ ఉండేదాన్ని. అమ్మ కూడా ఆ విషయాన్ని సరదాగా తీసుకుని ఏ అబ్బాయి అయినా కనిపిస్తే ఇతడితో పరిచయం పెంచుకో అంటూ జోక్‌ గా సలహా ఇచ్చేది.

ఇక కిరక్‌ పార్టీ సినిమా షూటింగ్‌ సమయంలో రక్షిత్‌ తో పరిచయం ఏర్పడినది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రక్షిత్‌ తో ప్రేమ విషయాన్ని మొదట అమ్మతో చెప్పాను. అమ్మ అందుకు ఓకే చెప్పింది. నీ ఇష్ట నువ్వు వెళ్లు - మేము నీకు అడ్డు రాము అంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలోనే ఇద్దరి మద్య విభేదాలు - ఇద్దరి మద్య లోటు పాట్లు కనిపించాయి. దాంతో పెళ్లికి ముందే ఈ బందంను వదులుకుంటే ఈ వివాదాలు చిన్నవిగా ఉన్నప్పుడే సర్దుమనుగుతాయని, లేదంటే ముందు ముందు మరింతగా ముదిరే అవకాశం ఉందని ఇద్దరం నిర్ణయించుకుని విడిపోయాం అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి నేను సినిమాను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News