స్టేజ్ పై నుంచి బన్నీకి 'ఐ లవ్ యూ' చెప్పేసిన రష్మిక!

Update: 2021-12-13 03:00 GMT
'పుష్ప' సినిమాలో రష్మిక 'శ్రీవల్లీ' పాత్రను పోషించింది. 'శ్రీవల్లీ' అంటూ సాగే పాట కూడా ఈ సినిమాలో బాగా పాప్యులర్ అయింది. నిన్నరాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ .. " ఇంతమంది అభిమానులను చూసి చాలా కాలమైపోయింది. నాకు అర్థమైంది .. మీ అందరికీ బన్నీ సార్ ను చూడాలని ఉందనీ .. ఆయన మాటలు వినాలని ఉందని. కానీ సామీ నేను కొంచెం సేపు మాట్లాడి వెళ్లిపోతాను .. ఓకేనా?. 'పుష్ప'ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

'గీత గోవిందం' ఆడియో ఫంక్షన్ లో అనుకుంటాను. నేను బన్నీ గారిని చూడగానే, ఆయనతో కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాను. ఆ అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఆ రోజు అలా కోరుకున్నాను .. ఈ రోజున 'పుష్ప'లో శ్రీవల్లిగా చేశాను. బన్నీ సార్ తో యాక్ట్ చేయడానికి నేను బాగా ఇష్టపడతాను అంటూ "బన్నీ సార్ ఐ లవ్ యూ' .. థ్యాంక్యూ సో మంచి అని చెప్పేసింది. అంతే .. ఆమె ఆ మాట అనగానే అభిమానుల్లో ఈలలు .. గోలలు .. మరింత సందడి మొదలైంది. ఈ సినిమా సెకండ్ పార్టు ఇంకా చేయవలసి ఉంది .. నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను.

ఈ సినిమా కోసం మా పేరెంట్స్ కి చాలా కాలంగా దూరంగా ఉండవలసి వచ్చింది. సుకుమార్ సార్ నన్ను అడాప్ట్ చేసుకుంటానని పేపర్స్ పంపిస్తే సైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇదే విషయాన్ని ఆయనకి మెసేజ్ పెట్టాను. మైత్రీ మూవీస్ నా హోమ్ బ్యానర్ వంటిది. ఈ బ్యానర్లో ఇంతమంచి సినిమా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా నా గురించి కూడా ఒక ఫైవ్ .. టెన్ పెర్సెంట్ అయినా ఈ సినిమాకి వస్తారని అనుకుంటున్నాను. రష్మిక .. సునీల్ .. అనసూయ ఉన్నారని మీరు సినిమాకి వచ్చినా, తెరపై మీకు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ సినిమా కోసం అందరం కూడా చాలా కష్టపడ్డాం. చిత్తూరు జిల్లా యాసను నేర్చుకోవడం .. డైలాగ్స్ చెప్పడం .. డబ్బింగ్ చెప్పడం .. నిజంగా చాలా కష్టపడ్డాం. ఇదంతా కూడా మిన్నల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లో చూడండి" అని చెప్పుకొచ్చింది. 'నేను చూడలేదని ఓ పులుపెక్కి పోతున్నవటగదా' అనే డైలాగ్ ను రష్మిక స్టేజ్ పై చెప్పడంతో కుర్రాళ్లు మరింత హుషారెత్తి పోయారు. నందివర్ధనానికి నల్లచీర చుట్టినట్టుగా గ్లామరస్ గా మెరుస్తూ స్టేజ్ పై రష్మిక బాగానే సందడి చేసింది.      
Tags:    

Similar News