సేతు - నంద - ఆర్య - రోబోట్ - ఐ.. ఇవన్నీ టాప్ డైరెక్టర్స్ తీసిన సినిమాలు. బాలా - శంకర్ - సుకుమార్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ లతో సింక్ అయ్యి పనిచేశారు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. అతడి పనితనమే వేరు. ఇండియాలో టాప్ 10 సినిమాటోగ్రాఫర్స్ జాబితాని తిరగేస్తే అందులో ఈయన పేరు తప్పకుండా ఉండాల్సిందే.
రత్నవేలు అంతటి క్రియేటివ్ హార్డ్ వర్కర్ కాబట్టే మన టాలీవుడ్ డైరెక్టర్ సుక్కూ అస్సలు రత్నవేలుని వదిలిపెట్టడు. ఈ ఇద్దరూ గొప్ప స్నేహితులు. ఆ స్నేహమే కుమారి 21 ఎఫ్ అనే బ్లాక్ బస్టర్ కి కారణమైంది. అయితే రత్నవేలు గారూ? ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు కదా! వాటిలో హీరోయిన్ల క్లీవేజ్ లను అంతే బాగా ఆవిష్కరించారు కదా? అన్న ప్రశ్నకు.. నేను అలాంటివాడిని కాదు.. నేనెప్పుడూ హీరోయిన్ల అందాల్ని వల్గర్ గా చూపించాలనుకోలేదు. క్లీవేజ్ షోలను చూపించేందుకు ఆరాటపడలేదు. నేను ప్రతి ఫ్రేముని ఎంతో పోయెటిక్ గా చూపించాలని ప్రయత్నిస్తానంతే. ఒక్కోసారి దర్శకులు నాయికల అందాల్ని ఎక్స్‌పోజ్ చేయాలని చెబుతారు. అలాంటప్పుడు కూడా నేనే టోన్ డౌన్ చేస్తాను. ఎంత చూపించాలో అంతే చూపిస్తాను.. అంటూ చెప్పుకొచ్చారు. ఇన్నేళ్లలో ఎందరో టాప్ డైరెక్టర్స్ తో పనిచేశాను. వీళ్లెవరూ అలా క్లీవేజ్ లే చూపించు అని అనలేదని చెప్పారు.
హీరోయిన్ - హీరో ఎవరైనా ముందుగా లుక్ టెస్ట్ చేస్తాను. వాళ్లు ఎలాంటి డ్రెస్ లలో బావుంటారో అలాంటివే సజెస్ట్ చేస్తాను. ఈ లుక్ టెస్ట్ మీ కోసం కాదు.. నా కోసం నా కెమెరా కంటి కోసం అంటూ ముందే చెబుతానని రత్నవేలు అన్నారు. ఇప్పుడర్థమైందా? ఎవరైనా తెరపై అందంగా కనిపించారంటే కెమెరా కంట్లోంచి చూడాలన్నమాట! కుమారిని కాస్త స్పెషల్ లెన్స్ తో చూపించాడంతే.