మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. రవితేజ నటించనున్న 70వ సినిమా ఇది. స్వామిరారా ఫేం సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా నిర్మాత.
నవంబర్ 5న టైటిల్- ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఏదో సంథింగ్ మ్యాజిక్ కనిపిస్తోంది. దేవాలయాలపై ఉన్న బొమ్మల్ని ఫోకస్ చేస్తూ ప్రీలుక్ ని రిలీజ్ చేయడమే గాక.. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్న క్యాప్షన్ ని ఇచ్చారు. అంటే హీరోలు హీరోయిజం లేనట్టేనని చెబుతారా.. దీనివెనక ఇంకేదైనా మార్మికత ఉందేమో! తెరపైనే చూడాలి. మరోసారి స్వామిరారా తరహాలోనే ఏదో థ్రిల్లింగ్ సబ్జెక్ట్ నే సుధీర్ వర్మ ఎంపిక చేసుకున్నారని అర్థమవుతోంది. కేశవ- రణరంగం తర్వాత అతడు ఈ సినిమాని ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
క్రైమ్ కామెడీ జోనరా లేక ఇంకేదైనానా? అనేది మునుముందు రివీల్ కానుంది. టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ లో చాలా వరకూ దీనిపై క్లూ ఇస్తారేమో చూడాలి. `మాస్ మహా మేకొవర్`ని చూడబోతున్నారు అంటున్నారు.. అంటే రవితేజ నుంచి డబుల్ ట్రిపుల్ మాసిజాన్ని ఆశించవచ్చని అర్థమవుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మరోవైపు సెట్స్ పై బిజీ బిజీ..
మాస్ మహారాజ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఇక ఖిలాడీ ప్రమోషన్స్ పైనా రవితేజ దృష్టి సారించనున్నారు. ఇప్పటికే మొదటి సింగిల్ విడుదలై మంచి స్పందన అందుకుంది. తదుపరి రెండో సింగిల్ ని రిలీజ్ చెయ్యడానికి తేది ఫిక్సయ్యింది. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ రెండో పాటను రిలీజ్ చేయనున్నామని టీమ్ ప్రకటించింది.
భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. రవితేజ ఫస్ట్ లుక్ కి ఇప్పటికే చక్కని స్పందన వచ్చింది. డింపుల్ హయాతి.. మీనాక్షి చౌదరి ఇందులో నాయికలు. నాయికల లుక్ లకు రెస్పాన్స్ బావుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని పెన్ స్టూడియోస్ -ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంతో పాటు ` రామారావు ఆన్ డ్యూటీ` అనే మరో చిత్రాన్ని రవితేజ సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్ని బట్టి ఇది కూడా తన ఇమేజ్ కి తగ్గట్టే పక్కా మాస్ యాక్షన్ చిత్రమిదని అర్థమైంది. ఇటీవలే `ధమాకా` అంటూ మాస్ లోకి దూసుకుపోయే టైటిల్ ని రవితేజ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మాస్ చిత్రమని మేకర్ ని బట్టి ఊహిస్తున్నారు. మాస్ రాజా దూకుడు చూస్తుంటే రానున్న రెండేళ్లలో ఐదారు సినిమాల్ని చకచకా పూర్తి చేసి రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారనే అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర సీనియర్లను రవితేజ ఫాలో చేస్తున్నారనే భావించవచ్చు.