టాలెంట్ అనేది సందర్భాన్ని బట్టి కరెక్ట్ గా బయటపడుతుందనే మాట చాలా నిజమైంది. సినిమాల్లో అయినా ఎక్కడైనా సరే మనిషి అసలైన టాలెంట్ సమయాన్ని బట్టి నిరూపితమవుతుంది. ఓ పని చేసిన వాడు మరో పని చేయలేడు అనుకోవడం మూర్ఖత్వం. ఈ విషయం చాలా మందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి తొక్కలో లెక్కలు చాలా ఉంటాయి. ఈ విషయం ఎవరో ఆజ్ఞతవాసి నుంచి వచ్చి పడినవి కావు. మాస్ రాజా రవితేజ వివరంగా చెప్పాడు.
నేల టిక్కెట్టు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లలో సంగీత దర్శకుల ప్రస్తావన రాగానే ఒక స్టైల్ లో సినిమాలు చేసిన శక్తికాంత్ కి మాస్ సినిమాలో ఎలా అవకాశం ఇచ్చారని అడగ్గా.. రవితేజ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు. అతను చేయలేడు అని కాదు. సినిమా బట్టి అతని టాలెంట్ బయటపడుతుంది. మెలోడీస్ చేసిన టెక్నీషియన్ కు కమర్షియల్ సినిమా ఇవ్వకపోవడానికి కారణం ఒక్కటే. కాన్ఫిడెన్స్ లేక. తొక్కలో లెక్కలు వేసుకొని డిసైడ్ చేస్తారు.
అది కరెక్ట్ కాదు. ఉదాహరణకు విక్రమార్కుడు సినిమా చూసుకుంటే. అందులో రెండు విభిన్నమైన పాత్రలు ఉంటాయి. విక్రమ్ రాథోడ్ కి ఆపొజిట్ గా మరో పాత్ర ఉంటుంది. రాజమౌళి నమ్మి ఆయన తీశారు. అందుకే వర్కవుట్ అయ్యింది. వర్క్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవ్వరికైనా అవకాశం రావాలి అంటూ.. మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ పై మాస్ రాజా వివరణ ఇచ్చారు.