మాస్ మహారాజా రవితేజ- త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ `ధమాకా` డిసెంబర్ 23న (గురువారం) భారీగా థియేటర్లలోకి విడుదలైంది. ఒక రోజు ముందే అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్లతో సందడి నెలకొంది. ఇంతకుముందులా కాకుండా రవితేజ ధమాకాను యాక్టివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇటీవల అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్ లో రవితేజ పాల్గొన్నారు. తన అభిమానులతో గడిపే ప్రక్రియను తాను ఎంజాయ్ చేశానని చెప్పారు. అభిమానులు కలుసుకోవడం సానుకూల శక్తిని ఇస్తుందని విశ్వాసాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా రవితేజ అన్నారు. ``నేను నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడను. సినిమానే ఎక్కువగా మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఫస్ట్ షో పూర్తయ్యాక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అది హిట్ అవ్వకుండా ఎవరూ ఆపలేరు. ఈ మధ్య కాలంలో నేను సరైన ఎంటర్‌టైనర్ చేయలేదు. రాజా ది గ్రేట్ తర్వాత ధమాకా పర్ఫెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. అంతేకాదు..కొత్తవారితో పనిచేయడం నాకు ఇష్టం. వారిలో తమను తాము నిరూపించుకోవాలనే ఉత్సాహం ఆకలి కనిపిస్తాయ``ని రవితేజ అన్నారు.
దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతను ఉల్లాసమైన వ్యక్తి. రచయిత ప్రసన్నకుమార్ డైలాగ్స్ ప్రధాన అస్సెట్ అని అన్నారు. అలాగే తన ప్రతి సినిమాకు ఒకే రకమైన జాగ్రత్తలు తీసుకుంటానని రవితేజ చెప్పారు. కానీ ఫలితం మన చేతుల్లో లేదు. కొన్ని కథలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కొన్ని కాకపోవచ్చు అని అన్నారు. ధమాకా ఆడియో ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇంత అద్భుతమైన ఆల్బమ్‌ను అందించినందుకు కంపోజర్ భీమ్స్ సిసిరోలియోకు నా అభినందనలు. భీమ్స్ చాలా మంచి ట్యూన్ మేకర్. సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచిందని అన్నారు.
సినిమాలో కథానాయికగా నటించిన శ్రీలీల ఇప్పటికే తన అందం- డ్యాన్స్- చురుకైన నటనతో ప్రశంసలు అందుకుంది. శ్రీలీలకి టాలెంట్ ఉంది. మంచి నటి.. మధురమైన గాత్రాన్ని కలిగి ఉంది. ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అని రవితేజ కితాబిచ్చారు.
తన నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిభొట్లని రవితేజ అభినందించారు. నా నిర్మాతలు చాలా పాజిటివ్ వ్యక్తులు. వారు సినిమాపై ఫ్యాషన్ ఉన్నవారు. వారితో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
వాల్టేర్ వీరయ్యలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..``ఇది చాలా బలమైన పాత్ర. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. మెగాస్టార్ చిరంజీవితో మళ్లీ కలిసి పనిచేయడం మంచి అనుభవం. తప్పకుండా మళ్లీ అన్నయ్యతో కలిసి పనిచేయాలనుకున్నాను. కానీ పాత్ర కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను`` అని అన్నారు.
తన తదుపరి చిత్రం టైగర్ నాగేశ్వరరావు అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని రవితేజ తెలిపారు. ఇది పాన్ ఇండియా సినిమా. కథ విస్తృత పరిధిని కలిగి ఉంటుంది. సినిమా కోసం మేకోవర్ మీరు తెరపై చూస్తారని అన్నారు. తదుపరి రావణాసురుడు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు కూడా తెలియజేశాడు.
వరుస సినిమాల షూటింగ్ ని ఆస్వాధిస్తున్నానని రవితేజ అన్నారు. ప్రతిరోజూ సెట్‌లో ఉండటం ఒక వేడుకగా భావిస్తాను. నా డిక్షనరీలో బోరింగ్ అనే పదం లేదు. నా జీవితంలో నాకు ఎటువంటి ఫిర్యాదులు లేదా విచారం లేదు.. అని కూడా అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.