మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో రవితేజ ఏ ఒక్క సినిమాకు కూడా హాజరు కానన్ని ఇంటర్వ్యూలకు హాజరు అయ్యాడు. పలు ప్రత్యేక కార్యక్రమాల్లో సందడి చేసి ధమాకా సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది.
రవితేజ పలు ఇంటర్వ్యూల్లో తన రాబోయే సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో తన టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ను పాన్ ఇండియా సినిమా చెప్పుకొచ్చాడు.
తన ప్రతి సినిమాను కూడా పాన్ ఇండియా సినిమా అనుకోను. నాకంటూ పాన్ ఇండియా సినిమా అంటే ఒక అర్థం ఉంది. అందుకే ధమాకా ను పాన్ ఇండియా సినిమా అనడానికి లేదు. కానీ నేను చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా పేర్కొన్నాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ బడ్జెట్ తో రూపొందకున్నా.. భారీ విజువల్స్ గ్రాండియర్ ఉండకున్నా కూడా పాన్ ఇండియా సినిమాగా చెప్పుకోవచ్చు. కథ మరియు కాన్సెప్ట్ వల్ల టైగర్ నాగేశ్వరరావును పాన్ ఇండియా సినిమాగా తాను భావిస్తాను అన్నట్లుగా రవితేజ చెప్పుకొచ్చాడు.
రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా గా టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ముందు ముందు ఆయన నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి టైగర్ నాగేశ్వరరావు రవితేజ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.