2017లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా ‘జయదేవ్’ అనే చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి కనిపించాడు. 2016లో తమిళంలో వచ్చిన సేతుపతికి ‘జయదేవ్’ అఫిషియల్ రీమేక్. తమిళంలో హిట్ అయిన సేతుపతి తెలుగులో జయదేవ్ గా మాత్రం హిట్ కొట్టలేక పోయింది. అప్పటి విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సేతుపతి సినిమా కథతోనే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తున్నాడట.
సేతుపతి సినిమాకు అనధికారిక ప్రీమేక్ అన్నట్లుగా ఇది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజకు పోలీస్ స్టోరీస్ బాగా సూట్ అవుతాయి కనుక సేతుపతి కథకు అటు ఇటుగా మార్పులు చేసి ‘క్రాక్’ తీస్తున్నట్లుగా చెబుతున్నారు. జయదేవ్ సినిమాను జనాలు పెద్దగా చూడలేదు కనుక స్టోరీ తెలిసే అవకాశం లేదు. క్రాక్ తీసినా కూడా ఎవరు గుర్తు పట్టరు అనే ఉద్దేశ్యంతో దర్శకుడు గోపీచంద్ ప్రీమేకర్ చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు గోపీచంద్.. రవితేజల కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు సక్సెస్ ను దక్కించుకున్నాయి. కనుక మరోసారి వీరి కాంబో హిట్ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఈ సమయంలో క్రాక్ సినిమా జయదేవ్ కు ప్రీమేకర్ అంటూ వార్తలు రావడం అందరికి ఒకింత షాకింగ్ గా ఉందట. అయితే ఈ ప్రీమేక్ విషయమై గోపీచంద్ ఎలా స్పందిస్తాడనేది చూడాలి.