సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న మాస్ రాజా 'క్రాక్'..

Update: 2021-01-02 14:26 GMT
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి మాములుగా ఉండదు. ఈ నెల 9న అదే సీన్ రిపీట్ కాబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు, సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ రాజా క్రాక్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేగాక సంక్రాంతికి జనవరి 14న విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను జనవరి 9న విడుదల కానుంది. ఈ వార్తతో అభిమానులలో ఫుల్ జోష్ పెరిగింది. ఇప్పటికే క్రాక్ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్ ఇలా అన్ని సినీ వర్గాలలో ఫుల్ క్రేజ్ అండ్ బజ్ క్రియేట్ చేసాయి. ఇప్పటికే నెట్టింట క్రాక్ మూవీ సాంగ్స్ హల్చల్ చేస్తూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్ న్యూ ఇయర్ రోజున అంటే జనవరి 1న విడుదలై సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ ట్రైలర్ కోసం మాస్ రాజా అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసారు. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక సీరియస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తేనే మాస్ రాజా యాక్షన్ ఏ రేంజిలో ఉందో అర్ధమవుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా అదే రేంజిలో ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా రవితేజ వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమాతో హిట్ పక్కా అంటున్నాయి సినీవర్గాలు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో రవితేజ హ్యాట్రిక్ సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు రెండు కూడా మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు క్రాక్ మూవీ ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ సబ్జెక్టు కాబట్టి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. చూడాలి క్రాక్ ఆకట్టుకుంటుందా.. లేదా అనేది.
Tags:    

Similar News