మాస్ మహారాజా రవితేజ ‘టచ్ చేసి చూడు’, ‘నేలటికెట్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లను మూట కట్టుకున్న విషయం తెల్సిందే. ఈయన ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ సమయంలోనే రవితేజ తర్వాత చిత్రాల గురించి ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ని రవితేజ రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ‘తేరీ’ రీమేక్ ను చేయాలని మొన్నటి వరకు భావించాడు. ‘నేల టికెట్’ ఫలితం తర్వాత రవితేజ ప్రయోగాలను చేసేందుకు భయపడుతున్నాడంటూ సమాచారం అందుతుంది. ప్రస్తుతం చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ ఫలితం ఎలా ఉంటోందో అనే భయంతో ఉన్న రవితేజ తదుపరి చిత్రాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేస్తే కెరీర్ ట్రబుల్స్ లో పడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నాడట. అందుకే తన తదుపరి చిత్రంను రీమేక్ కాకుండా డైరెక్ట్ సినిమాగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
‘తేరీ’ రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తాజాగా కొత్త కథను సిద్దం చేయమని చెప్పాడట. ఇటీవలే దర్శకుడు సంతోష్ స్క్రిప్ట్ ను కూడా సిద్దం చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంను దసరాకు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా తన మార్క్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించాలనేది రవితేజ అభిప్రాయంగా తెలుస్తోంది. రవితేజ మరో రెండు సినిమాలను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అవన్నీ కూడా పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్స్ అంటూ సమాచారం అందుతుంది.