'విక్రమార్కుడు' సీక్వెల్ పై ఇంట్రస్ట్ చూపని రవితేజ!

Update: 2021-09-20 00:30 GMT
రాజమౌళి కెరియర్ తొలినాళ్లలో చేసిన సినిమాలలో 'విక్రమార్కుడు' ఒకటి. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు .. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత  సినిమా విజయానికి ముఖ్య కారణమయ్యాయి.

దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను జెండా ఎగరేసింది. రవితేజ - అనుష్క జంటకి మంచి మార్కులు పడ్డాయి. ఇక కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మాస్ ఆడియన్స్ కి కావలసిన మసాలాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా రీమేక్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అలాంటి ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి. విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమా సీక్వెల్ కి కథను సిద్ధం చేశాడనీ, ఈ సినిమాకి రాజమౌళి కాకుండా మరొకరు దర్శకత్వం వహించనున్నారని చెప్పుకున్నారు.

అయితే ఈ వార్తలో నిజం లేదనీ .. అదంతా కేవలం పుకారు మాత్రమేనని తెలుస్తోంది. రవితేజ ఇంతకుముందు 'కిక్' సినిమాకి సీక్వెల్ గా 'కిక్ 2' చేశాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అప్పటి నుంచి రవితేజ తన సినిమాల్లో దేనికి కూడా సీక్వెల్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట. అందువలన ఆయన 'విక్రమార్కుడు' సీక్వెల్ చేసే అవకాశమే లేదనేది సన్నిహితులు చెబుతున్న మాట. ఇక ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 'ఖిలాడి' విడుదలకి ముస్తాబవుతూ ఉండగా .. 'రామారావు ఆన్ డ్యూటీ' సెట్స్ పై ఉంది. ఇక నక్కిన త్రినాథరావు సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది.
Tags:    

Similar News