రవితేజ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఖిలాడి సినిమాను ముగించిన రవితేజ మరో వైపు రామరావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా చేస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తి అయిన వెంటనే రావణసుర సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న రావణసుర సినిమాను సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభించబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఒక వైపు ఖిలాడి సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్న రవితేజ మరో వైపు రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా ముగించే పనిలో ఉన్నాడు. ఇవి కాకుండా ధమాకా సినిమాను కూడా రవితేజ కమిట్ అయ్యాడు. ఆ సినిమా కు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ సినిమ కూడా ఇదే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇన్ని సినిమాలు ఉండగా టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా రవితేజ అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమా ను ఎప్పుడు పట్టాలెక్కించేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఇన్ని సినిమాల్లో కనీసం మూడు నాలుగు సినిమాలు అయినా ఈ 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అకవాశాలు ఉన్నాయంటూ అభిమానులు ఆనందంగా ఎదురు చూస్తున్నారు.
రవితేజ ఖిలాడి సినిమా ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాని కరోనా థర్డ్ వేవ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిస్తే విడుదల వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమాల విడుదల గురించి ఆలోచన చేయకుండా రవితేజ వరుసగా సినిమాలు చేసుకు వెళ్లడం మంచి పరిణామంగా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రావణసుర సినిమా ను సుధీర్ వర్మ చాలా ఏళ్లుగా రవితేజ తో చేయాలని వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు రవితేజ డ్యూటీ ముగించిన వెంటనే పట్టాలెక్కించబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రవితేజ.. సుధీర్ వర్మల రావణసుర సినిమా ఇదే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.