రవిబాబు ఇన్నాళ్లకు కోలుకున్నాడు

Update: 2016-03-15 15:30 GMT
యాక్టర్ టర్న్ డ్ డైరెక్టర్ రవిబాబు.. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. అల్లరి లాంటి సెన్సేషనల్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవిబాబు.. ఆ తర్వాత అనసూయ - నచ్చావులే - అవును లాంటి మంచి హిట్లిచ్చాడు. ఐతే రవిబాబు కెరీర్ లో ఇప్పటిదాకా వరుసగా రెండు హిట్లు ఎప్పుడూ ఇవ్వలేదు. ఒక సర్ ప్రైజ్ హిట్టు కొట్టడం.. అతడి తర్వాతి సినిమాపై అంచనాలు పెరగడం.. అది డిజాస్టర్ అవ్వడం.. ఇలా సాగుతోంది రవిబాబు కెరీర్.

‘అవును’ సినిమాతో ఊహించని విజయాన్నందుకున్న రవిబాబు.. దానికి సీక్వెల్ గా తీసిన ‘అవును-2’తో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు. అవును-2 కూడా డిట్టో ఫస్ట్ పార్ట్ తరహాలోనే ఉండటంతో జనాలకు ఏమాత్రం నచ్చలేదు. ఈ ఫ్లాప్ నుంచి కోలుకోవడానికి రవిబాబుకు కొంచెం టైం పట్టింది. ఈ మధ్యే ఓ కొత్త కథ తయారు చేసుకుని దాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రవిబాబు.

ఐతే ఒక ఫ్లాప్ ఇచ్చాక మళ్లీ తనేంటో నిరూపించుకోవడానికి మరో కొత్త ప్రయత్నం చేయడం రవిబాబుకు మామూలే. ఈసారి అతను కొత్త నటీనటులతో ఓ లవ్ స్టోరీ చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ఆల్రెడీ వేట మొదలుపెట్టాడు. ఆడిషన్స్ ద్వారా హీరో హీరోయిన్లను, ఇతర పాత్రధారుల్ని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు రవిబాబు. ‘ఫ్లయింగ్ ఫ్రాగ్స్’ బేనర్ మీద తనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.
Tags:    

Similar News