‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకల మహిళల గురించి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు సీనియర్ నటుడు చలపతిరావు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నా.. క్షమాపణ చెప్పుకున్నా.. ఆయనపై ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. మహిళా సంఘాలు ఆయనపై దుమ్మెత్తిపోశాయి. సినీ జనాలు కూడా ఆయన్ని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో విమర్శల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే చలపతిరావు వ్యాఖ్యల్ని తప్పుబడుతూనే కొందరు ఆయన్ని క్షమించాలని అన్నారు. ఇండస్ట్రీలో మిగతా జనాలు చేసే కామెంట్లనూ ఎత్తి చూపారు.
ఐతే చలపతిరావు వ్యాఖ్యలపై ఆయన కొడుకైన ప్రముఖ నటుడు.. దర్శకుడు రవిబాబు ఏమంటాడా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రవిబాబు తన తండ్రి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తుండటం.. దారుణమైన కామెంట్లు చేస్తుండటం పట్ల రవిబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నో తప్పులు చేసిన వాళ్లు తన తండ్రిని విమర్శిస్తున్నారంటూ రవిబాబు వాపోయినట్లు సమాచారం.
భార్య ఉండగానే మరో వివాహం చేసుకున్న వాళ్లు.. భార్య చనిపోయాక మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల కోసం కష్టపడిన తన తండ్రిని విమర్శిస్తుంటే బాధగా ఉందని.. సినిమా పరిశ్రమలో పెద్దలుగా చెప్పుకునే వాళ్లు గతంలో మహిళలపై ఇంతకంటే దారుణంగా కామెంట్లు చేసినా ఎవ్వరూ నోరు మొదపలేదని.. వాళ్ల రేంజ్ ఎక్కువ కాబట్టే అందరూ మౌనంగా ఉన్నారని.. కానీ తన తండ్రి పొరపాటన ఓ మాట ఎక్కువగా మాట్లాడి.. తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగినా కూడా ఈ రకమైన కామెంట్లు చేయడం బాధ కలిగిస్తోందని రవిబాబు అన్నాడట. తన తండ్రిని ఇలాంటి మాటలు అని.. మానసికంగా చంపడం కంటే ఆయనపై భౌతిక దాడి చేసి చంపేయండని రవిబాబు ఆవేదన స్వరంతో అన్నట్లు సమాచారం. ఆయన కొడుకుగా ఇంతకంటే తానేమీ మాట్లాడలేనని రవిబాబు అన్నాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/