మాస్ మహారాజా రవితేజ ఎనర్జిటిక్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనలో ఆ యూనిక్ ఎనర్జీ నే మిగతా హీరోలనుంచి వేరు చేస్తుంది. ఎలాంటి కథలోనైనా...పాత్రలోనైనా తనదైన ఎనర్జీతో ఓఊపు తీసుకురావడం రవితేజకే చెల్లింది. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే? కారణం కేవలం తనలో ఆ ఎనర్జినే. దర్శకులు అందుకే రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసే కథలే సిద్దం చేస్తుంటారు.
అయితే ఈ తరహాలో కథలు తెరపైకి చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టింది. కానీ రవితేజకి మాత్రం బోర్ కొట్టలేదు. ఇంకా ఆ మూస ధోరణిళోనే మెజార్టీ సినిమాలు కనిపిస్తున్నాయి. తాజాగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో `ధమాకా` అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రినాధరావుకి ఇప్పటివరకూ ఫెయిల్యూర్ లేదు. కమర్శియల్ గా మంచి డైరెక్టర్ గా గుర్తింపు ఉంది.
ఇతని కథలు ఎనర్జీగానే సాగుతాయి. అందుకే రాజా తో సెట్ అయ్యాడు. మరి అలాంటి రెండు ఎనర్జీలు తోడైతే డబుల్ ఎనర్జీ కాక మరేంటి? అంటున్నారు త్రినాధరావు. అందుకే డబుల్ ధమాకా అనేది ఉపశీర్షిక అయింది. ఆయన ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా చేసిన పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని తెలిపారు. `అలాగే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు రవితేజని భిన్నమైన పాత్రల్లో చూస్తున్నారు. పాత రవితేజని మిస్ అవుతున్నారు. అందుకే ఇప్పుడా పాతరవితేజని మళ్లీ తట్టిలేపినట్లు` తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి `రౌడీ అల్లుడు` లాంటి ప్రయత్నమన్నారు. రవితేజ ఇందులో రెండు రకాల పాత్రలు పోషిస్తున్నారుట. హీరోయిన్ మాత్రం ఒక్కరేనంట. మరి శ్రీలీల ఎవరికి సొంతం అన్నది తెరపైనే చూడాలంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగుందన్నారు. ప్రేక్షకులు ఊహించని కొన్ని సన్నివేశాలు ఉన్నాయంట. అలాగే త్రినాధరావు దృష్టిలో పాన్ ఇండియా కథలంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవన్నారు. ఏ సినిమాలోనైనా భావోద్వేగాలు కనెక్ట్ అయితే? అది పాన్ ఇండియాలో సక్సెస్ అయినట్లే అంటున్నారు. తదుపరి మైత్రీ మూవీమేకర్స్ లో..దిల్ రాజ్ నిర్మాణంలో నక్కిన సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.