మాస్ రాజా అక్కడ ఖాతా తెరవలేదా..!

Update: 2023-01-08 11:30 GMT
మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషన్ ఆయనకు ఒక సరికొత్త ఊపు ఇచ్చింది. సినిమాలో ఓ గొప్పగా చెప్పుకునే స్టోరీ లేకపోయినా మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సినిమా సూపర్ హిట్ కొట్టేసింది. రవితేజ, శ్రీ లీల జోడీ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఇక సినిమాకు జేంస్ ఇచ్చిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల పైన గ్రాస్ తో వసూళ్ల హంగామా చేయగా ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. యూఎస్ లో ధమాకా ఇప్పటివరకు 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయలేదు.

ఇక్కడ విశేషం ఏంటంటే ధమాకా రవితేజ కెరీర్ లో ఫస్ట్ హాఫ్ మిలియన్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సాధించింది. అంతకుముందు వచ్చిన రవితేజ ఏ సినిమా కూడా కనీసం హాఫ్ మిలియన్ డాలర్స్ కూడా కలెక్ట్ చేయలేదు. మాస్ మహారాజా క్రేజ్ కేవలం తెలుగు రెండు రాష్ట్రాల వరకేనా ఓవర్సీస్ లో రవితేజని అభిమానించే వారు లేరా అంటే ఉన్నారు కానీ ఆయన చేసే సినిమాలన్ని తెలుగు ఆడియన్స్ కు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి దగ్గరగా ఉండటం వల్ల అలా జరుగుతుంది.

ధమాకా ఎలాగోలా హాఫ్ మిలియన్ డాలర్స్ వసూళు చేయగా.. అంతకుముందు రవితేజ హిట్ సినిమాలు బలుపు 449K డాలర్స్, రాజా ది గ్రేట్ 388K, పవర్ 378కK, కిక్ 2 345K డాలర్స్ వసూళు చేసింది. ధమాకా తో హాఫ్ మిలియన్ సాధించాడు రవితేజ. తెలుగులో మిగతా స్టార్స్ యువ హీరోలు కూడా యూఎస్ లో 1 మిలియన్ దాటి దూసుకెళ్తుంటే రవితేజ లాంటి సీనియర్ హీరో ఇప్పటివరకు అక్కడ మిలియన్ మార్క్ ఖాతా తెరవకపోవడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే అని చెప్పొచ్చు.

రవితేజ కేవలం తెలుగు ఆడియన్స్ గురించే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ మెచ్చే కథలను కూడా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. కొంతమంది స్టార్ హీరోలు ఓవర్సీస్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని కూడా కథలో కొన్ని మార్కులు చేస్తుంటారు. మరి రవితేజ ఫ్యూచర్ లో అయినా ఆ ఫీట్ సాధించేలా సినిమాలు తీయాలని ఆశిస్తున్నారు ఓవర్సీస్ రవితేజ ఫ్యాన్స్.
Tags:    

Similar News